ఎక్సయిజ్‌కు చుక్కెదురు! | government staff to sell alcohol | Sakshi
Sakshi News home page

ఎక్సయిజ్‌కు చుక్కెదురు!

Published Wed, Jul 8 2015 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

మద్యం విక్రయాల ద్వారా లాభపడదామని భావించిన ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. కోట్లాది రూపాయల లెసైన్సు ఫీజును వదులుకుని ప్రభుత్వ

 సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :మద్యం విక్రయాల ద్వారా లాభపడదామని భావించిన ప్రభుత్వానికి చుక్కెదురవుతోంది. కోట్లాది రూపాయల లెసైన్సు ఫీజును వదులుకుని ప్రభుత్వ సిబ్బందే మద్యం విక్రయించేలా తీసుకున్న నిర్ణయం స్థానికంగా విమర్శలపాలవుతోంది. జిల్లాలో 2015-17మధ్య కాలానికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా 23చోట్ల ప్రభుత్వమే మద్యం విక్రయించేలా దుకాణాల ఏర్పాటు ప్రక్రియను జిల్లా అధికారులు ప్రారంభించారు. వాస్తవానికి ఈ ప్రక్రియ కూడా గత నెల 30వ తేదీనాటికే పూర్తికావాల్సి ఉండగా ప్రైవేట్ మద్యం దుకాణాల లాటరీ కార్యక్రమంలో అధికారులు తలమునకలైపోవడంతో ఈ నెల 3వ తేదీ నాటికి కచ్చితంగా అన్ని చోట్లా పూర్తిచేస్తామని కమిషనర్‌కు భరోసా ఇచ్చారు.
 
 ఇవీ ఇబ్బందులు
 శ్రీకాకుళం జిల్లాలో మునిసిపాలిటీలో ఒకటి, గార, కళ్లేపల్లి, చిలకపాలెం, ఆమదాలవలస, పైడిభీమవరం, పొందూరు, నరసన్నపేట, పోలాకి, పాలకొండ, వీరఘట్టం, రాజాం, ఉంగరాడ మెట్ట, పాతపట్నం, కొత్తూరు, టెక్కలి, నందిగాం, కోటబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు, సోంపేట, బారువ, ఇచ్చాపురం పరిధిలో ఒక్కో దుకాణం ఏర్పాటుకు అధికారులు నిర్ణయించారు. అయితే శ్రీకాకుళం పట్టణంలో దుకాణం ఏర్పాటుకు స్థలం దొరకడం లేదు. సోంపేటలో పంచాయతీ కార్యాల యం పరిధిలో ఉన్న ఓ భవనంలో దుకాణం ఏర్పాటుకు కలెక్టర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అక్కడ మంగళవారమే ప్రారంభిం చేశారు. ఇక్కడ కూడా వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశౠలు లేకపోలేదు.
 
  పోలాకిలో కూడా నేడో, రేపో దుకాణం ఏర్పాటు ఖాయమని అధికారులు చెబుతున్నారు. శ్రీకూర్మం పరిధిలో ప్రభుత్వ మద్యం దుకాణం ఏర్పాటుకు స్థానికులు అంగీకరించడం లేదు. దైవ సన్నిధి సమీపంలో ప్రభుత్వమే మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే ఎలా అంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా ఎక్సైజ్ కమిషనర్‌కు లేఖ రాశారు. అయితే 500మీటర్ల దూరంలో దుకాణం ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన చట్టంలో ఉండడంతో అధికారులు రేపోమాపో దుకాణం ఏర్పాటుకు సిద్ధమైపోయారు. అదే విధంగా ఆమదాలవలస సహా చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ మద్యం దుకాణాలేర్పాటుపై స్థానికుల నుంచి ఫిర్యాదులొస్తున్నాయి. శ్రీకాకుళం పట్టణంలోని జెడ్పీ సమీపంలో గతంలో ఓ దుకాణం ఉండేది. స్థానికులు ఆ దుకాణంపై ఫిర్యాదివ్వడంతో కలెక్టర్ చొరవతో ఆ దుకాణం పలాసకు మారింది. రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో ఆ దుకాణం ఎక్కడ ఏర్పాటు కానుందో స్పష్టత రావడం లేదు.
 
 ప్రొసీడింగ్స్ కరువు
 దుకాణాలేర్పాటు విషయంలో ఉన్నతాధికారుల నుంచీ సమాచారం కరువైంది. దుకాణాలేర్పాటుకు గడువు, గెజిట్ నోటిఫికేషన్‌లో ఉన్న వివరాలకు అధికారులు జారీ చేసిన సమాచారానికీ తేడా వంటి విషయాల్లో స్పష్టత రావాల్సి ఉందని ఆ శాఖ అధికారులే చెబుతున్నారు. దుకాణాల్లో ఎక్సైజ్‌శాఖకు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లు మద్యం విక్రయాలు చేపడుతుండగా స్థానిక సీఐ వ్యాపార లావాదేవీలు చూస్తున్నారు. అయితే కానిస్టేబుళ్లు ప్రభుత్వ మద్యం దుకాణాలకే పరిమితమైపోతే మిగతా పనులకు ఆటంకం కలుగుతుందనేది తెలిసిందే. కొన్ని చోట్ల స్థానికుల వ్యతిరేకత కారణంగా ఈ దుకాణాలు ఎన్నాళ్లు ఉంటాయో తెలియని పరిస్థితి. స్వచ్చమైన మద్యంతో పాటు ఎమ్మార్పీ పక్కాగా అమలు చేసేందుకు ఏర్పాటవుతున్న ప్రభుత్వ మద్యం దుకాణాల్లో..స్థానిక వ్యాపారులతో పోటీ తప్పదు. ధర తగ్గించి అమ్మడం, డిస్కౌంట్లు ప్రకటించడం వంటివి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో కుదరవు. అదే విధంగా పర్మిట్ రూం ఏర్పాటు, ప్రైవేట్ సిబ్బంది నియామకం విషయంలో ఇబ్బందులు తప్పేలా లేవు. ఇవన్నీ ఎలారా బాబూ అంటూ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement