సామర్లకోటలో ఎక్సైజ్ అకాడమీ
పట్టణ పరిధిలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ ముకేష్ కుమార్‌మీనా తెలిపారు. గురువారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల భూమిని ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన విస్తరణ శిక్షణ కేంద్రంలో అకాడమీ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించామని,
-
స్థలాన్ని పరిశీలించిన కమిషనర్
సామర్లకోట :
పట్టణ పరిధిలోని విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎక్సైజ్ అకాడమీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆ శాఖ కమిషనర్ ముకేష్ కుమార్‌మీనా తెలిపారు. గురువారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ప్రభుత్వం కేటాయించిన 20 ఎకరాల భూమిని ఆయన తన సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రభుత్వం కేటాయించిన విస్తరణ శిక్షణ కేంద్రంలో అకాడమీ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని పరిశీలించామని, దానిపై ఒక ప్రాజెక్టు తయారు చేసి ప్రభుత్వానికి నివేదక అందజేసి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఈ అకాడమీలో ఎక్సైజ్ సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇస్తామని చెప్పారు. తమ శాఖలో పని చేసి తీవ్రవాదుల చేతిలో మృతి చెÆ దిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఒక ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. కుటుంబాలను ఆదుకొనే అవకాశం తమ శాఖలో తక్కువగా ఉంటుందని తెలిపారు. గతంలో ఉన్న బార్ పాలసీని కొనసాగిస్తామని, బార్ల సంఖ్యను పెంచే యోచన లేదని తెలిపారు. గంజాయిని నివారించడానికి ప్రత్యేకంగా ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎక్సైజ్ శాఖ డైరెక్టరు కర్రి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైల్వే స్టేషన్‌లో ఉన్న జీఆర్పీ సిబ్బంది కొరత కారణంగా ఆయా లోకల్ పోలీసులకు కేసులు బదిలీ చేస్తురన్నట్టు తెలిపారు. శిక్షణ కేంద్రం ఎంపీడీఓ రామ్‌గోపాల్, ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్, డిప్యూటీ కమిషనర్ దేవకుమార్, డీఎస్పీలు పాల్గొన్నారు.
06పీటీపీ46: ఎక్సైజ్ అకాడమీకి స్థలాన్ని పరిశీలిస్తున్న కమిషనర్, డైరెక్టరు, ఇతర అధికారులు