ఈ-ఆఫీస్‌లో జీహెచ్‌ఎంసీ భేష్ | ghmc top in e-office | Sakshi
Sakshi News home page

ఈ-ఆఫీస్‌లో జీహెచ్‌ఎంసీ భేష్

Published Fri, Jun 3 2016 9:38 PM | Last Updated on Mon, Sep 4 2017 1:35 AM

ghmc top in e-office

సాక్షి, సిటీబ్యూరో: పారదర్శకతతో పాటు ఫైళ్లు త్వరితగతిన పరిష్కరించేందుకు ఉద్దేశించిన  ఈ-ఆఫీస్ అమలులో జీహెచ్‌ఎంసీ చేస్తున్న కృషిని కేంద్రంలోని పలువురు అధికారులు ప్రశంసించారు. సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టం  ఆధ్వర్యంలో కోల్‌కత్తాలో శుక్రవారం ప్రారంభమైన రెండు రోజుల వర్క్‌షాప్‌లో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డి తాము అమలు చేస్తున్న ఈ - ఆఫీస్‌పై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. 
 
 ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ- ఆఫీస్ ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా మొత్తం 4,69,754 ఫైళ్లు రూపొందించగా, అందులో ఒక్క జీహెచ్‌ఎంసీవే 80వేల ఫైళ్లున్నాయన్నాయని తెలిపారు. అలాగే 45 లక్షల ఫైళ్లు ఈ ఆఫీస్ ద్వారా సర్క్యులేట్ కాగా, వాటిల్లో 6 లక్షలు జీహెచ్‌ఎంసీవేనన్నారు. జీహెచ్‌ఎంసీలో 2014 నవంబర్ 5న ఈ-ఆఫీస్‌ను ప్రారంభించినప్పటి నుంచి ఎలా వినియోగిస్తున్నదీ వివరించారు. జీహెచ్‌ఎంసీలోని ఉద్యోగులందరికీ శిక్షణనిచ్చి, ఈ- ఆఫీస్ ద్వారా మాత్రమే ఫైళ్లను స్వీకరిస్తున్నామని తెలిపారు. ఈ- ఆఫీస్ వినియోగంతో జీహెచ్‌ఎంసీ జాతీయ ఈ-గవర్నెన్స్ కార్యక్రమంలో కీలక భాగస్వామిగా ఎదిగిందన్నారు. ఈ-ఆఫీస్‌ను పూర్తిస్థాయిలో వినియోగిస్తున్న ఏకైక కార్పొరేషన్ దేశంలో జీహెచ్‌ఎంసీయేనని చెప్పారు. అవసరమైనన్ని స్కానర్లు, సామర్ధ్యం కలిగిన ఇంటర్నెట్ వినియోగిస్తున్నామన్నారు. 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement