వనపర్తిటౌన్, న్యూస్‌లైన్: కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని కాసుల కు కక్కుర్తి పడి రాబందుల పాలుచేసేందుకు సా క్షా త్తు సంస్థానాధీశుల వారసుడే ప్రయత్నించడం ప్ర జలను విస్మయానికి గురిచేస్తోంది. తండ్రి రాజారామేశ్వర్‌రావు ప్రభుత్వానికి ఉదారంగా దానం చేసిన భూ మికి ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో ఆయన వారసుడు రాజా కృష్ణదేవరావు ఆ భూమిని అమ్మి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నించాడు. వివరాల్లోకి వెళి తే... దివంగత వనపర్తి సంస్థానాధీశులు రాజారామేశ్వర్‌రావు నిర్మించిన రాజభవనం వెనక 40 అడుగు వెడల్పు, 1158 అడుగుల పొడవైన స్థలాన్ని 50 ఏళ్ల క్రితం పార్క్ (లాన్)కోసం నక్ష గీసి ప్రభుత్వానికి అ ప్పగించారు. అప్పటి నుంచి ఆ భూమి వనపర్తి మున్సిపల్ పరిధిలోనే కొనసాగుతోంది. అయి తే అధికారులెవరూ ఆ స్థలాన్ని పట్టించుకోకపోవడం తో ప్రాంతం ముళ్ల పొదలతో నిండిపోయింది.
2008 లోనే కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ స్థలా న్ని అమ్మేందుకు శతవిధాల ప్రయత్నించినా ప్రజలు ఆందోళనలు చేయడంతో వెనకడుగు వేశారు. ప్రస్తుతం పట్టణంలో భూముల ధరలకు రెక్కలు రావడంతో కోట్లకు పడగెత్తిన రాజావారి వారుసుడు కూడా కాసులకు కక్కుర్తిపడ్డారు. తన తండ్రి ఉదారంగా ఇచ్చిన భూమిని అమ్మేందుకు సిద్ధమయ్యారు. ఐదు రోజులుగా కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, స్థానిక రాజకీయ నాయకుల సహకారంతో అధికారులను లోబర్చుకుని ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా స్థలంలో ఉన్న ప్రభుత్వ బోర్డును సైతం తీసేసి * 6 కోట్లకు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. అయితే సదరు భూమి మున్సిపల్ ఆధీనంలో ఉందని పేర్కొంటూ మున్సిపల్ కమిషనర్ రాతపూర్వకంగా సబ్ రిజిస్ట్రార్ కు లేఖ రాసినా పట్టించుకోకుండా ఆయన పట్టించుకోకుంగా రిజిస్ట్రేషన్‌కు అంగీకరించడం గమనార్హం. సోమవారం సాయంత్రం ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేస్తున్నారనే సమాచారం అందడంతో పట్టణ వాసులు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేపట్టారు. రాజావారి కారును అడ్డుకుని ఘెరావ్ చేయడంతో ఆయన రిజిస్ట్రేషన్ చేయకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. వనపర్తి చరిత్రలో సంస్థానాధీశుల వారసులను అడ్డుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
లాన్ ప్రభుత్వ స్థలమే: కమిషనర్
రాజా రామేశ్వర్‌రావు స్వ హస్తాలతో నక్ష రూపొందించి ప్రభుత్వానికి ఇచ్చారని, అది ప్రభుత్వ స్థలమే అవుతుందని వనపర్తి కమిషనర్ గౌస్ మోహిద్దీన్ పేర్కొన్నారు. లాన్ ప్రభుత్వ స్థలమని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ అధికారికి రాతపూర్వకంగా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. సమస్యను వనపర్తి తహశీల్దార్, ఆర్డీవో, డీఎస్పీల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన వివరించారు.
తండ్రి దానం చేసిన భూమిని కబ్జా చేసేందుకు తనయుడి యత్నం!
Published Tue, Sep 3 2013 5:27 AM | Last Updated on Fri, Sep 1 2017 10:24 PM
Advertisement