వింగ్‌ అధికారులతో కమిషనర్‌ సమీక్ష | commissioner Review with Wing officials | Sakshi
Sakshi News home page

వింగ్‌ అధికారులతో కమిషనర్‌ సమీక్ష

Published Wed, Jul 27 2016 1:40 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

commissioner Review with Wing officials

వరంగల్‌ అర్బన్‌ : వరంగల్‌ మహానగర పాలక సంస్థ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మంగళవారం తిరిగి విధుల్లో చేరారు. మూడు వారాలపాటు వ్యక్తిగత కారణాలతో సెలవుల్లో ఉన్న కమిషనర్‌ బల్దియా ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్‌లో వింగ్‌ అధికారులతో వేర్వేరుగా వివిధ కార్యకలాపాలపై సమీక్షించారు. అడిషనల్‌ కమిషనర్‌ షాహిద్‌మసూద్, ఎస్‌ఈ అబ్దుల్‌రహ్మాన్, సీపీ కోదండరామిరెడ్డిని అడిగి వివిధ పనులపై ఆరా తీశారు. హరితహారం, అభివృద్ధి పనుల పురోగతి, బిల్లుల చెల్లింపులు, పారిశుద్ధ్య తీరు తెన్నులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి, ముఖ్యమైన ఫైళ్లపై సంతకాలు చేశారు. సాయంత్రం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. ఉదయం నుంచి రాత్రి వరకు కమిషనర్‌ బిజీబిజీగా గడిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement