విజయవాడ స్పోర్ట్స్: ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారిపై ఓ దుకాణం యజమాని దాడికి పాల్పడిన ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలే ఘటనకు కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ మీడియాలో వెలువడ్డ కథనాల్లో నిజం లేదని, అసత్యాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు.
చెక్కు చెల్లకపోవడంతో..
ధర్మవరానికి చెందిన హోల్‌సేల్ వస్త్ర వ్యాపారి అన్ని ప్రాంతాలకు వ్రస్తాలను సరఫరా చేస్తుంటారు. విజయవాడ పటమటలోని ఆలయ సిల్‌్క్స షాపు యజమానికి గతేడాది డిసెంబర్‌లో రూ.2.34 లక్షల విలువ చేసే వ్రస్తాలను సరఫరా చేశారు. దీనికి సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో డబ్బులివ్వాలని ఆలయ సిల్‌్క్స యజ మాని గుడవర్తి అవినాష్ గుప్తాను పలుమార్లు ఫోన్‌లో కోరారు.
ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి ఈ నెల రెండో తేదీన విజయవాడ వచ్చారు. దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆలయ సిల్‌్క్స యజమాని అవినాష్ గుప్తా, సూపర్‌వైజర్ చీవేళ్ల నాగేశ్వరరావు, మరో వ్యక్తి కలసి వస్త్ర వ్యాపారిని, అతడి స్నేహితుడిని చేతులతో కొట్టారు.
దుస్తులు విప్పించి నగ్నంగా నాలుగు గంటల పాటు బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు గుడవర్తి అవినాష్గుప్తా, నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది.
తెనాలిలో అలాంటి నాయకులెవరూ లేరు..
ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
తెనాలి: వస్త్ర వ్యాపారిపై తెనాలికి చెందిన వైఎస్సార్ సీపీ అవినాష్ గుప్తా జులుం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజం లేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కొల్లిపరలో ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో స్థానం ఉండదని, తప్పు చేస్తే సీఎం జగన్ ఏమాత్రం ఉపేక్షించరని స్పష్టం చేశారు.
2011లో పారీ్టలో చేరిన తాను అవినాష్ గుప్తా అనే వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లో మీడియా కథనాలు వికృత చేష్టలకు నిదర్శమన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు.
ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జుత్తు పట్టుకుని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన ఉదంతాన్ని ప్రజలు మరచిపోలేదని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment