cloth merchant
-
వస్త్ర వ్యాపారిపై దాడికి వ్యాపార లావాదేవీలే కారణం
విజయవాడ స్పోర్ట్స్: ఇటీవల విజయవాడలో వస్త్ర వ్యాపారిపై ఓ దుకాణం యజమాని దాడికి పాల్పడిన ఘటనలో ఎలాంటి రాజకీయ కోణం లేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. నిందితులకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, వ్యాపార లావాదేవీలే ఘటనకు కారణమని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓ మీడియాలో వెలువడ్డ కథనాల్లో నిజం లేదని, అసత్యాలను వ్యాప్తి చేయవద్దని సూచించారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టీకే రాణా శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. చెక్కు చెల్లకపోవడంతో.. ధర్మవరానికి చెందిన హోల్‌సేల్ వస్త్ర వ్యాపారి అన్ని ప్రాంతాలకు వ్రస్తాలను సరఫరా చేస్తుంటారు. విజయవాడ పటమటలోని ఆలయ సిల్‌్క్స షాపు యజమానికి గతేడాది డిసెంబర్లో రూ.2.34 లక్షల విలువ చేసే వ్రస్తాలను సరఫరా చేశారు. దీనికి సంబంధించిన చెక్కు చెల్లకపోవడంతో డబ్బులివ్వాలని ఆలయ సిల్‌్క్స యజ మాని గుడవర్తి అవినాష్ గుప్తాను పలుమార్లు ఫోన్లో కోరారు. ఈ క్రమంలో డబ్బులు వసూలు చేసుకునేందుకు తన స్నేహితుడితో కలిసి ఈ నెల రెండో తేదీన విజయవాడ వచ్చారు. దుకాణం వద్ద ఘర్షణ చోటు చేసుకోవడంతో ఆలయ సిల్‌్క్స యజమాని అవినాష్ గుప్తా, సూపర్వైజర్ చీవేళ్ల నాగేశ్వరరావు, మరో వ్యక్తి కలసి వస్త్ర వ్యాపారిని, అతడి స్నేహితుడిని చేతులతో కొట్టారు. దుస్తులు విప్పించి నగ్నంగా నాలుగు గంటల పాటు బంధించారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై శుక్రవారం బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులు గుడవర్తి అవినాష్గుప్తా, నాగేశ్వరరావును అరెస్ట్ చేశారు. మరో వ్యక్తిని అదుపులోకి తీసుకోవాల్సి ఉంది. తెనాలిలో అలాంటి నాయకులెవరూ లేరు.. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ తెనాలి: వస్త్ర వ్యాపారిపై తెనాలికి చెందిన వైఎస్సార్ సీపీ అవినాష్ గుప్తా జులుం ప్రదర్శించారంటూ ఆంధ్రజ్యోతి ప్రచురించిన కథనంలో నిజం లేదని తెనాలి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి కొల్లిపరలో ఎమ్మెల్యే శివకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీతో అతడికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాంటి వారికి తమ పార్టీలో స్థానం ఉండదని, తప్పు చేస్తే సీఎం జగన్ ఏమాత్రం ఉపేక్షించరని స్పష్టం చేశారు. 2011లో పారీ్టలో చేరిన తాను అవినాష్ గుప్తా అనే వ్యక్తిని ఎన్నడూ చూడలేదన్నారు. ఎల్లో మీడియా కథనాలు వికృత చేష్టలకు నిదర్శమన్నారు. చంద్రబాబు హయాంలో మహిళలపై లెక్కలేనన్ని దాడులు, అఘాయిత్యాలు జరిగాయని పేర్కొన్నారు. ఇసుక దోపిడీని అడ్డుకున్నందుకు జుత్తు పట్టుకుని ఎమ్మార్వో వనజాక్షిపై దాడికి పాల్పడ్డ చింతమనేని ప్రభాకర్‌పై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా ప్రోత్సహించారని గుర్తు చేశారు. విజయవాడలో టీడీపీ నేత వినోద్ జైన్ ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడి బాధితురాలి ఆత్మహత్యకు కారణమైన ఉదంతాన్ని ప్రజలు మరచిపోలేదని చెప్పారు. -
కసిదీరా కొట్టి.. మర్మాంగాన్ని కోసి..
విజయనగరం, జియ్యమ్మవలస: మండలంలోని పెదమేరంగి కూడలిలో ఇద్దరి వ్యక్తుల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాల మీదకు వచ్చింది. పెదమేరంగి కూడలిలో దుస్తుల వ్యాపారం చేస్తున్న పల్ల ధర్మారావును అదే కూడలిలో కిరాణా వ్యాపారం చేస్తున్న బంటు లోకనాథం బుధవారం ఉదయం గొడవపడ్డారు. ఈ సంఘటనలో లోకనాథం రాడ్డుతో ధర్మారావు తలపై బాదాడు. అనంతరం అతడి మర్మాంగాన్ని కోసి పరారయ్యాడు. విషయం తెలుసుకున్న ఎల్విన్‌పేట సీఐ డీవీజే రమేష్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుడ్ని పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా.. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విజయనగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దాడికి ఉపయోగించిన కత్తి, రాడ్డుతో పాటు పడిపోయిన మర్మాంగాన్ని పోలీసులు భద్రపరిచారు. ఇద్దరు వ్యక్తులు ఎందుకు ఘర్షణ పడ్డారో తెలియాల్సి ఉందని సీఐ తెలిపారు. సీఐ సూచనల మేరకు ఎస్సై బి. శివప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని వస్త్ర వ్యాపారి ఆత్మహత్య
వాకాడు : ఉరేసుకుని వస్త్ర వ్యాపారి మండలంలోని చినతోట సమీపంలో ఉన్న జామాయిల్ తోటలో మంగళవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల సమాచారం మేరకు.. చిత్తూరు జిల్లా నగిరి ప్రాంతానికి చెందిన వస్త్ర వ్యాపారి బండి బుజ్జయ్య (56) చినతోట ప్రాంతంలో లుంగీలు తెచ్చి అమ్మేవాడు. కుటుంబ సభ్యుల మధ్య కొంత కాలంగా కలహాలు ఏర్పడటంతో బుజ్జయ్య చినతోటలోనే ఉండేవాడు. ఈ క్రమంలో తాను అమ్మే లుంగీతోనే జామాయిల్ చెట్టుకు ఉరేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న వాకాడు ఎస్ఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడి వద్ద లభించిన సెల్ నంబర్ ఆధారంగా పోలీసులు బంధువులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. -
ఉపాధి కోసం వచ్చి మృత్యుఒడిలోకి..
భీమడోలు: జాతీయ రహదారి భీమడోలు కనకదుర్గమ్మ ఆలయం వద్ద శనివారం మోటార్ బైక్‌ను లారీ ఢీకొట్టిన ఘటనలో వస్త్ర వ్యాపారి డొక్కల రమణ (30) మృతి చెందగా మరో వ్యా పారి గడిదేసి సింహాచలంకు తీవ్ర గాయాల య్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఏలూరు పత్తేబాదకు చెందిన గడిదేసి సింహాచలంతో పాటు ఏటిగట్టుకు చెందిన డొక్కల రమణ మోటార్ సైకిల్‌పై దుస్తులను విక్రయించేం దుకు భీమడోలు వచ్చారు. తిరిగి ఏలూరు వెళుతుండగా భీమడోలు రైల్వే గేటు దాటి కనకదుర్గమ్మ ఆలయం వైపు వెళుతుండగా ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం వైపు అతివేగంగా వెళ్తున్న పశ్చిమబెంగాల్‌కు చెందిన టమాటా లోడు లారీ వీరిని ఢీకొట్టింది. దీంతో బైక్‌పై ఉన్న రమణ, సింహాచలంకు తీవ్రగాయాలయ్యాయి. బైక్ వెనుక కూర్చున రమణ తలకు బలమైన గాయం కావడంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి అక్కడి నుంచి విజయవాడ తరలించగా మృతి చెందారు. సింహాచలం ఏలూరులో చికిత్స పొందుతున్నారు. భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.