
పనితీరు మెరుగుపరుచుకోండి
సాక్షి, హైదరాబాద్: పనితీరు మెరుగుపరు చుకోవాలని.. ప్రజలకు అందుబాటులో ఉంటూ, నేరాల నియంత్రణ, నేరస్థులపై ఉక్కు పాదం మోపాలని ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ అనురాగ్‌శర్మ సూచించారు. బడ్జెట్ సమీక్ష సందర్భంగా మంగళవారం రాష్ట్ర పోలీ స్ ముఖ్యకార్యాలయంలో సుదీర్ఘ భేటీ జరిగిం ది. బడ్జెట్‌పై అధికారులతో 3 గంటల పాటు చర్చించారు. అవినీతి ఆరోపణలు, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఎస్పీలు, కమిషనర్లపై డీజీపీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఇద్దరు ఎస్పీల బదిలీ వేటు నేపథ్యంలో పని తీరు మెరుగుపరుచుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిసింది. కొత్త జిల్లాల్లో చేప ట్టాల్సిన పలు నిర్మాణాలపై ఎస్పీలు ప్రతిపా దనలు సమర్పించారు. సీసీ కెమెరాల, కమాం డ్ కంట్రోల్ సెంటర్లు, టెక్నాలజీ వినియోగం తదితరాలకు రూ.5,038 కోట్లు అవసరమని ఉన్నతాధికారులు అంచనాకు వచ్చారు. ప్రతిపాదనలను 2 రోజుల్లో సీఎం కేసీఆర్‌కు అందజేయనున్నట్టు తెలిపారు.