మొగుడు, పెళ్లాం కొట్లాటలో ఎవరైనా పంచాయితీ చేస్తారేమయ్యా?! ఇది కూడా అలాంటిదే. కొట్లాట వచ్చిన దానికి కారణం లేదు.
– గుంతకల్లు మునిసిపల్ చైర్‌పర్సన్, కమిషనర్ వివాదంపై ఎంపీ జేసీ వ్యాఖ్య
గుంతకల్లు టౌన్ : ‘మొగుడు, పెళ్లాం కొట్లాటలో ఎవరైనా పంచాయితీ చేస్తారేమయ్యా?! ఇది కూడా అలాంటిదే. కొట్లాట వచ్చిన దానికి కారణం లేదు. పోయేదానికీ మన ప్రమేయం అవసరం లేద’ని గుంతకల్లు మునిసిపల్ చైర్‌పర్సన్, కమిషనర్‌ల మధ్య వివాదంపై ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం సాయంత్రం గుంతకల్లుకు విచ్చేసిన ఆయన మునిసిపల్ చైర్‌పర్సన్ చాంబర్‌లో చైర్‌పర్సన్ అపర్ణ, కమిషనర్ సత్యనారాయణ మధ్య తలెత్తిన వివాదంపై పంచాయితీ చేశారు. సర్దుకుపోవాలని ఇద్దరికీ సూచించారు.స్థానిక ఎమ్మెల్యే జితేంద్రగౌడ్ కూడా హాజరయ్యారు. అనంతరం జేసీ విలేకరులతో మాట్లాడుతూ పైవిధంగా వ్యాఖ్యానించారు.