వీడియో కాన‍్ఫరెన్స్‌లో పాల్గొన్న అధికారులు
ప్రజాసాధికార సర్వేను నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్రపునీత్ జిల్లా అధికారులను ఆదేశించారు.
– వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీసీఎల్‌ఎ ఆదేశం
– 1, 2 తేదీల్లో సాధికార సర్వే మేళా నిర్వహించాలని సూచన
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వేను నెలాఖరులోగా పూర్తి చేయాలని రాష్ట్ర భూపరిపాలన శాఖ ముఖ్య కమిషనర్ అనిల్‌చంద్రపునీత్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాసాధికార సర్వే తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. సర్వేలో కొన్ని మున్సిపాలిటీలు వెనుకబడి ఉన్నాయని పేర్కొన్న ఆయన పూర్తిస్థాయిలో దృష్టి సారించి నెలాఖరు నాటినికి పూర్తి చేయాలన్నారు. వచ్చే నెల 1, 2 తేదీల్లో సాధికార సర్వే మేళా నిర్వహించాలని, సర్వేలోకి రాని కుటుంబాలు ఈ తేదీల్లో గ్రామ పంచాయతీ కార్యలయం దగ్గరకు వచ్చి సర్వే చేయించుకునే విధంగా చూడాలన్నారు. ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. సర్వే పరిధిలోని వారికి డిసెంబరు నుంచి ప్రభుత్వ లబ్ధి ఆగుతుందని తెలిపారు. ఈ–పాసు పుస్తకాల కోసం వచ్చిన దరఖాస్తుల సత్వరం పరిష్కరించాలన్నారు. క్లియర్ చేసిన వాటిలో కూడా రిజెక్టు ఎక్కువగా ఉంటోందని చెప్పిన ఆయన ఎందుకు తిరస్కరించారనే విషయంపై విచారణాధికారులుగా నియమితులైన ఆర్డీఓలు దృష్టి సారించాలన్నారు. చుక్కల భూములపై నెలాఖరులోగా మంత్రివర్గం తీసుకుంటుందన్నారు. జిల్లా నుంచి జేసీ మాట్లాడుతూ... ప్రజాసాధికార సర్వేను ఈ నెల చివరిలోగా పూర్తి చేస్తామని తెలిపారు. ఈ–పాసు పుస్తకాల దరఖాస్తుల పెండింగ్‌ను తగ్గిస్తామని వివరించారు. వీడియోకాన్పరెన్స్‌లో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు, కలెక్టర్ కార్యాలయ పరిపాలనాధికారి వెంకటనారాయణ, సెక‌్షన్ సూపరింటెండెంట్లు ఈరన్న, రామాంజనమ్మ, మీసేవ కేంద్రాల పరిపాలనాధికారి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.