వడదెబ్బకు 37 మంది మృతి
- కరీంనగర్ జిల్లాలో అత్యధికంగా 9 మంది
- విపత్తు నిర్వహణ శాఖకు కలెక్టర్ల నివేదిక
- నేడు తెలంగాణ వ్యాప్తంగా వడగాడ్పులు
సాక్షి, హైదరాబాద్/రామాయంపేట/ నిజాం పేట/మనూర్: తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వడగాడ్పుల తీవ్రత పెరిగింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదవు తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వడదెబ్బ తగిలి బుధవారం నాటికి 37 మంది మృతి చెందినట్లు విపత్తు నిర్వహణ శాఖ స్పెషల్ కమిషనర్ సదా భార్గవి ‘సాక్షి’కి తెలిపారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 9 మంది వడదెబ్బతో మృతిచెందారు. నాగర్ కర్నూలు, ఖమ్మం జిల్లాల్లో నలుగురు, భద్రాద్రి జిల్లాలో ముగ్గురు, కామారెడ్డి, మహబూబ్ నగర్, మంచి ర్యాల, రంగారెడ్డి జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. కుమ్రం భీం, మహబూబాబాద్, మేడ్చల్, సిరిసిల్ల, సంగా రెడ్డి, సూర్యాపేట, వనపర్తి, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న చనిపోయారని కలెక్టర్లు వెల్లడించారు.
చర్యలు శూన్యం..
రాష్ట్రంలో ప్రస్తుతం 45 డిగ్రీల వరకు ఉష్ణో గ్రతలు నమోదవుతున్నాయి. పరిస్థితి తీవ్ర తపై సర్కారుకు ఎప్పటికప్పుడు నివే దికలు అందుతున్నా ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటంలో వైఫల్యం కనిపిస్తోందన్న ఆరో పణలు వస్తున్నాయి. రాష్ట్ర విపత్తు నిర్వ హణ శాఖ వేసవి కార్యాచరణ ప్రణాళికను రూపొం దించింది. ఎఫ్‌ఎం రేడియో ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలి. ఐస్ ప్యాక్స్, ఐవీ ఫ్లూయిడ్స్‌ను అందుబాటులో ఉంచాలి. 108 సర్వీసులను అందుబాటులో ఉంచాలి. ఆరు బయట శారీరక శ్రమ చేసే వారికి నీడ కల్పించాలి. ఫ్యాక్టరీల్లో ఏసీ వసతి కల్పించాలి.
నేడు వడగాడ్పులు..
రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. గురువారం కూడా రాష్ట్రంలో వడ గాడ్పులు వీస్తాయని హైదరాబాద్ వాతా వరణ కేంద్రం హెచ్చరించింది. సాధారణం కంటే నాలుగైదు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్ర తలు నమోదవుతాయని తెలిపింది. కాగా, బుధవారం ఆదిలాబాద్‌లో అత్యధి కంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
వడదెబ్బతో 9 మంది మృతి
సాక్షి, నెట్‌వర్క్: వడదెబ్బతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా 9 మంది మృతి చెందారు. మృతు ల్లో నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం రాజవరం గ్రామానికి చెందిన గడ్డమీది వెంక మ్మ(65), మిర్యాలగూడలో విజయనగరం శ్రీను(38) యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం దత్తప్పగూడంలో భూమ అంజయ్య (55), జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లలో కాంపెల్లి దుబ్బయ్య (65), కథలాపూర్ మండలం సిరి కొండలో ఏనుగు లింగారెడ్డి(36), యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండ లం మైలారం గ్రామ తండాలో కంకరమిల్లు కూలీ రమావత్ నీలా (30), మెదక్ జిల్లా నిజాంపేట మం డలం ఖాసీంపూర్‌లో మైలు నారాయణ(62), సిద్దిపేట జిల్లా బెజ్జంకి మం డలం గుండారంలో కోరుకొప్పుల కిష్టవ్వ (68), సంగారెడ్డి జిల్లా మనూరులో ఎర్ర రామయ్య(70) ప్రాణాలు కోల్పోయారు.