సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత భారీ వర్షాల వల్ల నష్టపోయిన వారికి ‘హుద్‌హుద్’ నష్టపరిహారం ప్యాకేజి అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పలువురు ప్రాణాలు కోల్పోగా భారీగా పంటలకు, ఇళ్లకు నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో బాధితులకు ‘హుద్‌హుద్’ తుపాను సమయంలో అమలు చేసిన(పెంచిన) సహాయ ప్యాకేజిని వర్తింపజేస్తున్నట్లు విపత్తు నిర్వహణ శాఖ ముఖ్య కార్యదర్శి జేసీ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.