Weather Forecast: AP Disaster Management Warned About Heat Waves For Two Days - Sakshi
Sakshi News home page

AP Weather Alert: విపత్తుల శాఖ వార్నింగ్‌.. రెండు రోజులు జాగ్రత్తగా ఉండండి

Published Thu, Apr 13 2023 6:18 PM | Last Updated on Thu, Apr 13 2023 6:42 PM

AP Disaster Management Warned About Heat Waves For Two Days - Sakshi

సాక్షి, అమరావతి: ఏపీ ప్రజలను రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు హెచ్చరించారు. రేపు(శుక్రవారం), ఎల్లుండి(శనివారం) వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల శాఖ పేర్కొంది. దీంతో, అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది. 

కాగా, రేపు ఏడు మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 168 మండలాల్లో వడగాల్పులు.. ఎల్లుండి 106 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎండ నుంచి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. 

రేపు వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(168)..
అల్లూరిసీతారామరాజు జిల్లా- 7,
అనకాపల్లి -13,
తూర్పుగోదావరి- 14,
ఏలూరు- 11,
గుంటూరు- 11,
కాకినాడ -14,
కోనసీమ- 6,
కృష్ణా - 11,
నంద్యాల -4,
ఎన్టీఆర్ -16,
పల్నాడు -8,
పార్వతీపురంమన్యం -12,
శ్రీకాకుళం -13,
విశాఖపట్నం -4,
విజయనగరం -22,
వైఎస్సార్ -2
మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఇక, గురువారం అనకాపల్లి -8, 
కాకినాడ -1,  
నంద్యాల-1, 
విజయనగరం-1 మండలంలో  తీవ్రవడగాల్పులు, 60 మండలాల్లో వడగాల్పులు నమోదయ్యాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement