
గోవాను గెలిపించిన లూయిజ్
పుణే: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో తొలిసారిగా పుణే సిటీపై ఎఫ్‌సీ గోవా జట్టు విజయం సాధించింది. గురువారం జరిగిన ఈ మ్యాచ్‌ను ఎఫ్‌సీ గోవా 1-0తో గెలుచుకుంది. మ్యా చ్‌లో నమోదైన ఏకైక గోల్‌ను ఫ్రీకిక్ ద్వారా రాఫెల్ లూరుుజ్ (32వ నిమిషంలో) సాధించాడు. పుణే సిటీ ద్వితీయార్ధంలో తమ దాడులను ఉధృతం చేసినా ఫలితం లేకుండా పోరుుంది.