ఐఎస్‌ఎల్ సెమీస్‌లో కేరళ | Semifinals the Indian Super League in Kerala | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ సెమీస్‌లో కేరళ

Published Wed, Dec 10 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 PM

Semifinals the Indian Super League in Kerala

పుణేపై 1-0తో గెలుపు
 
కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీ జట్టు సెమీస్‌లోకి ప్రవేశించింది. మంగళవారం జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఎఫ్‌సీ పుణే సిటీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కేరళ 1-0తో నెగ్గి నాకౌట్ దశకు చేరిన మూడో జట్టయ్యింది. 23వ నిమిషంలో ఇయాన్ హుమే సూపర్ ఫ్రీకిక్‌తో జట్టుకు గోల్‌ను అందించాడు. ఆతర్వాత బంతిపై పట్టు కోసం పుణే ఎంత ప్రయత్నించినా సఫలం కాలేకపోయింది.

చెన్నైయిన్, ఢిల్లీ గేమ్ డ్రా

చెన్నై: ఐఎస్‌ఎల్‌లో తమ చివరి లీగ్ మ్యాచ్‌ను చెన్నైయిన్ ఎఫ్‌సీ, ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ జట్లు 2-2తో డ్రా చేసుకున్నాయి. ఈ మ్యాచ్ గెలిచి ఉంటే ఢిల్లీ సెమీస్‌కు చేరేది. మరోవైపు ఈ ఫలితంతో నార్త్‌ఈస్ట్ జట్టు లీగ్ నుంచి బయటకు వెళ్లిన తొలి జట్టయ్యింది. మ్యాచ్ 16వ నిమిషంలోనే చెన్నైయిన్‌కి పెలిస్సారి గోల్ అందించాడు.  28వ నిమిషంలో జే జే ఆధిక్యాన్ని 2-0కి పెంచాడు. ద్వితీయార్ధంలో ఢిల్లీ చెలరేగడంతో 53వ నిమిషంలో డెల్ పియరో, 88వ నిమిషంలో ముల్డర్ రూపంలో స్కోరును సమం చేసింది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement