
కోల్‌కతా, గోవా మ్యాచ్ డ్రా
ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తొలి అంచె సెమీఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతా, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0-తో డ్రాగా ముగిసింది.
ఐఎస్‌ఎల్ సెమీస్
కోల్‌కతా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తొలి అంచె సెమీఫైనల్లో అట్లెటికో డి కోల్‌కతా, ఎఫ్‌సీ గోవా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0-తో డ్రాగా ముగిసింది. సాల్ట్‌లేక్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరు జట్లుగోల్స్ నమోదు చేయడంలో విఫలమయ్యాయి.
మ్యాచ్ మొత్తంలో గోవా జట్టుకు పలు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. 18వ నిమిషంలో రోమియో కొట్టిన షాట్ గోల్ పోస్ట్‌కు దూరంగా వెళ్లింది. కోల్‌కతా నుంచి గార్షియా, పోడి అద్భుతంగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయారు. ఐఎస్‌ఎల్‌కు నేడు (సోమవారం) విశ్రాంతి దినం.