ముంబైపై కోల్‌కతా పైచేయి | Atletico de Kolkata beat Mumbai City 3-2 in first | Sakshi
Sakshi News home page

ముంబైపై కోల్‌కతా పైచేయి

Published Sun, Dec 11 2016 2:00 AM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

ముంబైపై కోల్‌కతా పైచేయి

ముంబైపై కోల్‌కతా పైచేయి

కోల్‌కతా: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌ సెమీఫైనల్‌ అంచె తొలి మ్యాచ్‌లో మాజీ చాంపియన్‌ అట్లెటికో డి కోల్‌కతా పైచేయి సాధించింది. ముంబై సిటీ ఎఫ్‌సీతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 3–2 గోల్స్‌ తేడాతో గెలిచింది. మ్యాచ్‌లో నమోదైన ఐదు గోల్స్‌ తొలి అర్ధభాగంలోనే రావడం విశేషం.

కోల్‌కతా తరఫున రాల్టె (3వ ని.లో) ఒక గోల్‌ చేయగా... ఎడ్వర్డ్‌ హుమే (39వ, 45వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు. ముంబై జట్టుకు కోస్టా (10వ ని.లో), వియెరా (19వ ని.లో) ఒక్కో గోల్‌ అందించారు. 13న ముంబై జట్టుతోనే జరిగే రెండో సెమీఫైనల్‌ మ్యాచ్‌లో కోల్‌కతా ‘డ్రా’ చేసుకుంటే ఫైనల్‌కు చేరుకుంటుంది. ఆదివారం జరిగే మరో సెమీఫైనల్లో కేరళ బ్లాస్టర్స్‌తో ఢిల్లీ డైనమోస్‌ తలపడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement