
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ ఎఫ్‌సీ జట్టు మరో ‘డ్రా’ నమోదు చేసింది. శుక్రవారం ఏటీకే మోహన్ బగాన్, హైదరాబాద్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1–1తో డ్రా అయింది. ఆట 54వ నిమిషంలో మన్వీర్ సింగ్ చేసిన గోల్‌తో మోహన్ బగాన్ 1–0తో ముందంజ వేసింది. రెండో అర్ధభాగంలో హైదరాబాద్ ఈ లెక్కను సరిచేసింది. 65వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను జావో విక్టర్ గోల్‌గా మలచడంలో హైదరాబాద్ మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. లీగ్‌లో ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌లాడిన హైదరాబాద్ ఎఫ్‌సీ ఒక మ్యాచ్‌లో గెలుపొంది, 3 మ్యాచ్‌ల్లో డ్రా నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment