ఎప్పటికీ క్రీడాకారుడినే: సచిన్ టెండూల్కర్
ఎప్పటికీ క్రీడాకారుడినే: సచిన్ టెండూల్కర్
Published Thu, Apr 24 2014 11:33 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
ముంబై: నా హృదయంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఎప్పటికి తాను క్రీడాకారుడిగానే ఉంటానని సచిన్ స్పష్టం చేశారు.
ఇండియన్ సూపర్ లీగ్ లో కోచి ఫుట్ బాల్ జట్టును పీవీపీ వెంచర్స్ అధినేత ప్రసాద్ పొట్లూరితో కలిసి సచిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. యువకులను ప్రోత్సాహం అందించి.. అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడానికి ఇండియన్ సూపర్ లీగ్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని సచిన్ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ క్రీడను అభివృద్ది చేసేందుకు తాము ఆశించిన లక్ష్యాలను కోచి క్లబ్ ద్వారా చేరుకుంటామనే విశ్వాసాని సచిన్ వ్యక్తం చేశారు. షేన్ వార్న్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవన్ జట్టు, మెరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆడేందుకు సచిన్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. మెరీలేబోన్ క్రికెట్ క్లబ్ కు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్ జూలై 5 తేదిన లార్డ్స్ మైదానంలో జరుగనుంది. ఎంసీసీ లో సచిన్, షేన్ వార్న్ గౌరవ సభ్యులుగా ఉన్నారు.
Advertisement
Advertisement