Prasad V Potluri
-
చీల్చి చెండాడటానికి ‘ఫైటే’ అక్కర్లేదు..
ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్‌పై ప్రముఖ నిర్మాత పీవీపీ ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ ట్యాలెంట్‌ను అభినందించిన పీవీపీ ఎంతో మంది నిర్మాతలు ఆయనతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్. తమ్ముడు స్టార్ట్ యూవర్ కుమ్ముడు’ అని పేర్కొన్నారు. పీవీపీ ట్వీట్‌పై స్పందించిన హరీష్.. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని పేర్కొన్నారు. కాగా, ఇటీవల హరీష్ నైపుణ్యాన్ని తక్కువ చేసేలా నిర్మాత బండ్ల గణేష్ సోషల్ మీడియాలో సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీ తన ట్వీట్ ద్వారా హరీష్ ట్యాలెంట్‌ను గుర్తుచేయడంతోపాటు బండ్ల గణేష్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడని అభిమానులు అంటున్నారు. (చదవండి : వర్మ మరో సంచలనం.. క్లైమాక్స్ ట్రైలర్) కాగా, మే 11తో గబ్బర్‌సింగ్ చిత్రం విడుదలై 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్‌ను గుర్తుచేసుకుంటూ హరీష్ శంకర్ ఒక లేఖను విడుదల చేశారు. అయితే అందులో బండ్ల గణేష్ పేరు మిస్సయింది. జరిగిన పోరపాటును గుర్తించిన హరీష్ మరో ట్వీట్లో బండ్ల గణేష్ గురించి ప్రస్తావించారు. అయితే అప్పటికే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా హరీష్‌పై ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. హరీష్‌కు తను అవకాశం ఇవ్వకపోతే సినిమాలే లేవని కామెంట్ చేశాడు. మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం.🙏🙏🙏🙏 Thank you for acknowledging my work Sir https://t.co/md0YjnZjqi — Harish Shankar .S (@harish2you) May 18, 2020 -
బండ్ల గణేష్‌ది క్రిమినల్ మైండ్
-
‘జర ఓపిక పట్టు తమ్మీ’
సాక్షి, అమరావతి : కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల్లో భాగంగానే టాటా సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి సేవ చేస్తుందని వైఎస్సార్సీపీ నేత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) అన్నారు. కానీ కొంత మంది తామే టాటా సంస్థను ఏపీ తెచ్చామని డబ్బాలు కొట్టుకోవడం విడ్డూరంగా ఉందని పరోక్షంగా చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. వైఎస్సార్సీపీపై విమర్శలు చేసే వారు కాస్త ఓపికతో ఉండాలని, త్వరలోనే సీఎం జగన్ వైద్యవ్యవస్థలో మార్పులు తెచ్చి ఆరోగ్యశ్రీకి మళ్లీ పుర్వవైభవాన్ని తీసుకోస్తారని చెప్పారు. ‘అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు టాటాను నేనే తెచ్చా అని డబ్బా ఏంటప్ప. సీఎస్ఆర్ కింద అన్ని కంపెనీలు చేయవలసిన సామాజిక సేవ అది. ఆరోగ్యశ్రీ అనే సంచలనం మన దేశంలో జరిగింది. కొన ఊపిరితో ఉన్న వైద్య వ్యవస్థకు సంజీవని ఇచ్చి మళ్ళీ పూర్వవైభవాన్ని తీసుకురాబోతున్నారు వైఎస్ జగన్. జర ఓపిక పట్టు తమ్మీ’ అని పీవీపీ ట్వీట్ చేశారు. -
విజయవాడను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా
-
‘నా పిలక ఏ ప్రభుత్వం చేతిలో లేదు.. ఉండబోదు’
సాక్షి, విజయవాడ : తన పిలక ఏ ప్రభుత్వం చేతిలో లేదని.. ఇక మీదట ఉండబోదని వైసీపీ ఎంపీ అభ్యర్థి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ)స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ తర్వాత ఇక్కడ ఏం చేయాలో తనకు తెలియలేదన్నారు. ఇన్నేళ్ల తర్వాత ఇప్పుటికి కూడా రాష్ట్రంలో అవే పరిస్థితులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరిగేషన్ మంత్రి ఇక్కడి వాడే.. కృష్ణా నది పక్కనే ఉన్నా జనాలకు తాగునీరు అందించలేని దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి గంటలు గంటలు మాట్లాడటం కాదు.. చేతల్లో చూపాలని పేర్కొన్నారు. ఎకనామిక్, సోషల్ ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ను డెవలప్ చేయాలి.. హెల్త్ సర్వీసెస్‌ని అభివద్ధి చేయాలని తెలిపారు. పెద్ద పెద్ద ఈవెంట్స్ విజయవాడకు వస్తే అనేక మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఒక కామన్ మ్యాన్‌గా విజయవాడలో అనేక ఉపాధి అవకాశాలు కల్పించాను.. ఎంపీగా గెలిపిస్తే తనకున్న కార్పొరేట్ సర్కిల్‌ను విజయవాడ అభివృద్ధికి తోడ్పాటుగా తీసుకువస్తానని స్పష్టం చేశారు. తాను చెప్పిన అభివృద్ధికి డబ్బులతో పనిలేదని.. సంకల్పం ఉంటే చాలని తెలిపారు. తన మీద ఆరోపణలు చేసేవారు ఈ ఐదేళ్లలో ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనపై ఒక్క సీబీఐ చార్జ్ షీట్ కూడా లేదని కావాలంటే చెక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తనను ఇబ్బంది పెట్టే వ్యవహారాలు ఏం లేవని.. తన పిలక ఏ ప్రభుత్వం చేతిలో లేదని.. ఇక మీదట ఉండబోదని స్పష్టం చేశారు. ఇక సినిమాల విషయానికోస్తే... పెద్ద పెద్ద హీరోయిన్లు తనతో పని చేశారని ఎవరతో సమస్య రాలేదని తెలిపారు. ఒక్క శృతిహాసన్ మాత్రం షూటింగ్ మధ్యలో వదిలేసి వెళ్లిపోయారని.. పోరాడి మరి ఆమెకిచ్చిన అడ్వాన్స్ డబ్బును వెనక్కి తెచ్చుకున్నానని తెలిపారు. -
అన్ని లోక్‌సభ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం తథ్యం
-
ప్రముఖ నిర్మాత పీవీపీకి పితృ వియోగం
ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) ఈ రోజు మధ్యాహ్నం అన్యారోగ్యంతో మరణించారు. నిన్న ఉదయం కిమ్స్ లో ఎడ్మిట్ అయిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పొట్లూరి రాఘవేంద్రరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఎప్పటికీ క్రీడాకారుడినే: సచిన్ టెండూల్కర్
ముంబై: నా హృదయంలో క్రీడలకు ప్రత్యేక స్థానం ఉంటుందని మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్ టెండూల్కర్ తెలిపారు. ఎప్పటికి తాను క్రీడాకారుడిగానే ఉంటానని సచిన్ స్పష్టం చేశారు. ఇండియన్ సూపర్ లీగ్ లో కోచి ఫుట్ బాల్ జట్టును పీవీపీ వెంచర్స్ అధినేత ప్రసాద్ పొట్లూరితో కలిసి సచిన్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. యువకులను ప్రోత్సాహం అందించి.. అత్యుత్తమ ఆటగాళ్లుగా తీర్చిదిద్దడానికి ఇండియన్ సూపర్ లీగ్ చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని సచిన్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ క్రీడను అభివృద్ది చేసేందుకు తాము ఆశించిన లక్ష్యాలను కోచి క్లబ్ ద్వారా చేరుకుంటామనే విశ్వాసాని సచిన్ వ్యక్తం చేశారు. షేన్ వార్న్ నేతృత్వంలోని రెస్ట్ ఆఫ్ వరల్డ్ ఎలెవన్ జట్టు, మెరీలెబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) ల మధ్య జరిగే మ్యాచ్ లో ఆడేందుకు సచిన్ ఇంగ్లాండ్ బయలుదేరనున్నారు. మెరీలేబోన్ క్రికెట్ క్లబ్ కు సచిన్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న ఈ మ్యాచ్ జూలై 5 తేదిన లార్డ్స్ మైదానంలో జరుగనుంది. ఎంసీసీ లో సచిన్, షేన్ వార్న్ గౌరవ సభ్యులుగా ఉన్నారు.