
ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) ఈ రోజు మధ్యాహ్నం అన్యారోగ్యంతో మరణించారు. నిన్న ఉదయం కిమ్స్ లో ఎడ్మిట్ అయిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పొట్లూరి రాఘవేంద్రరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.