Ragavendra Rao
-
రాఘవేంద్రుడి డైరెక్షన్
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీ దర్శకులు కె.రాఘవేంద్రరావు నియమితులయ్యారు. శనివారం సాయంత్రం టీటీడీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇంతకు ముందు టీటీడీ ట్రస్ట్‌బోర్డులో సభ్యుడిగా కొనసాగిన రాఘవేంద్రరావును ఈసారి ఎస్వీబీసీకి చైర్మన్‌గా నియమించినట్లు టీటీడీ తన ప్రకటనలో పేర్కొంది. ఎస్వీబీసీకి చైర్మన్‌ను నియమించడం ఇదే మొదటిసారి. తిరుమల వేంకటేశ్వరస్వామి భక్తి తత్వాన్ని, క్షేత్ర ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి చాటేందుకు, హిందూ ధార్మికతను పెంచేందుకు 2008లో టీటీడీ ఎస్వీబీసీ చానల్‌ను ప్రారంభించింది. ఏడాదికి రూ.25 కోట్ల బడ్జెట్‌ను కేటాయించి ఎస్వీబీసీని నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ సీఈఓలుగా కేఎస్ శర్మ, జయదేవరెడ్డి, ఎస్.రామానుజం, మధుసూదనరావు, నరసింహారావులు పనిచేశారు. ప్రస్తుతం టీటీడీ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారిముక్తేశ్వరరావు ఎస్వీబీసీకి ఇన్చార్జి సీఈఓగా కొనసాగుతున్నారు. ఆరోపణలు ఉన్నప్పటికీ ఇటీవల ఎస్వీబీసీ ఉద్యోగులు, సీఈఓ నరసింహా రావుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నడిచింది. ఎస్వీబీసీ నిధులను కొల్లగొట్టడమే కాకుండా నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పలువురు ఉద్యోగులు సీఈఓపై ఈఓకు ఫిర్యాదు చేశారు. సీఈఓ నరసింహారావు నిధుల వాడకంపై విజిలెన్సు విచారణ కూడా జరిగింది. ఇందులో రూ.2 కోట్లకు పైగా నిధులు దుర్వినియోగమైనట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అప్ప టి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉన్న రాఘవేంద్రరావు ఎస్వీబీసీలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. ఈ కార్యక్రమం కోసం కోట్లలో నిధులు ఖర్చు పెట్టారని, యాంకర్ పార్టులు మార్చి పాత వాటినే కొత్త ఎపిసోడ్లుగా చూ పారన్న ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్వీబీసీ పరిస్థితి గందరగోళంగా మారింది. చానల్ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయంలో ఉన్న టీటీడీ తాజాగా ఎస్వీబీసీ చైర్మన్ నియామకాన్ని జరి పింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావుకు చైర్మన్ పదవిని ఎలా ఇస్తారన్నది కొందరు ఉద్యోగుల ప్రశ్న. మొదటి నుంచీ ఎస్వీబీసీ వ్యవహారంలో పోరాటం చేస్తున్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్‌కుమార్‌రెడ్డి కూడా చైర్మన్‌గా రాఘవేంద్రరావు నియామకాన్ని తప్పుబడుతున్నారు. -
ప్రముఖ నిర్మాత పీవీపీకి పితృ వియోగం
ప్రముఖ పారిశ్రామికవేత్త, సినీ నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి తండ్రి పొట్లూరి రాఘవేంద్రరావు (81) ఈ రోజు మధ్యాహ్నం అన్యారోగ్యంతో మరణించారు. నిన్న ఉదయం కిమ్స్ లో ఎడ్మిట్ అయిన పొట్లూరి రాఘవేంద్రరావుగారు ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు (అక్టోబర్ 27) ఉదయం 11.00 గంటలకు విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పొట్లూరి రాఘవేంద్రరావు మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
ఎవర్ గ్రీన్ మన్మథుడికి బర్త్ డే విషెస్
టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రస్తుతం ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజు గారి గది 2 షూటింగ్ లో ఉన్న నాగ్ కు పుట్టిన రోజు కానుకగా చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేయనుంది. నాగార్జున హీరో భక్తిరస చిత్రాలను అందించిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశాడు. 'మా ఎవర్ గ్రీన్ గ్రీకువీరుడు, ఏ పాత్రనైనా చేయగల ఘరానా బుల్లోడు, అందరిని మెప్పించగల రామదాసు, నాగార్జున కి జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్వీట్ చేశారు. నాగ్ వెండితెరకు పరిచయం చేసిన యోగా బ్యూటి అనుష్క, మంచు హీరోలు మనోజ్, విష్ణులతో పాటు ప్రస్తుతం నాగ్ హీరోగా తెరకెక్కుతున్న రాజు గారి గది 2 నిర్మాతలు కూడా సోషల్ ట్విట్టర్ ఫేస్ బుక్ ల ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. Wishing a Very Happy Birthday to one and only king @iamnagarjuna garu, the smartest man ever! -
'ఓం నమో వేంకటేశాయ' మూవీ రివ్యూ
టైటిల్ : ఓం నమో వేంకటేశాయ జానర్ : చారిత్రక భక్తిరస చిత్రం తారాగణం : నాగార్జున, అనుష్క, సౌరభ్ జైన్, రావూ రమేష్ సంగీతం : ఎం.ఎం.కీరవాణి దర్శకత్వం : కే.రాఘవేంద్రరావు నిర్మాత : ఎ.మహేష్ రెడ్డి అన్నమయ్య, శ్రీ రామదాసు, శిరిడిసాయి లాంటి భక్తిరస చిత్రాలను అందించిన నాగార్జున, కే. రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన మరో భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. తెలుగు వారికి పెద్దగా పరిచయం లేని హథీరాం బాబాజీ జీవితకథను తిరుమల కొండ విశేషాలను తెలుగు ప్రజలకు పరిచయం చేసే ఆలోచనలో తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను, భక్తజనులను ఎంత వరకు అలరించింది..? నాగ్ మరోసారి పరమ భక్తుడిగా ఆకట్టుకున్నాడా..? డివోషనల్ చిత్రాలను తెరకెక్కించటంలో తనకు తిరుగులేదని ఇప్పటికే నిరూపించుకున్న దర్శకేంద్రుడు మరోసారి మెప్పించాడా..? కథ : రాజస్థాన్ బంజారా ప్రాంతంలో జన్మించిన రామ(నాగార్జున) చిన్నతనం నుంచి దేవుణ్ని చూడాలనే కోరికతోనే పెరుగుతాడు. ఆ ఆశయంతోనే ఇళ్లు విడిచి వెళ్లి అనుభవానంద స్వామి ( సాయికుమార్)దగ్గర శిష్యరికం చేస్తాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఓంకార జపం చేస్తూ కఠోర తపస్సు చేస్తాడు. అలా ఏళ్లు గడిచిపోతాయి. రామ భక్తికి మెచ్చిన వేంకటేశుడు, వటపత్రశాయిగా వచ్చి బాలుడి రూపంలో రామ తపోభంగం చేస్తాడు. అయితే బాలుడి రూపంలో వచ్చినది ఆ దేవదేవుడే అని గుర్తించ లేని రామ ఆగ్రహంతో వెళ్లిపొమ్మని శాసిస్తాడు. ఆ బాధలో ఇంటికి వెళ్లిన రామానికి, మరదలు భవాని (ప్రగ్యాజైస్వాల్) తో పెళ్లి చేయాలని నిర్ణయిస్తారు పెద్దలు. కానీ భగవంతుడిని దర్శించటమే తన జీవితాశయం అని భవానికి నచ్చజెప్పి తన ప్రయాణం మొదలు పెడతాడు. గురువు ద్వారా ఆ రోజు తన తపోభంగం చేసిన ఆ బాలుడే తాను చూడాలనుకుంటున్న బాలాజీ అని తెలుసుకొని తిరుమల కొండపైకి చేరుకుంటాడు. కొండమీదే ఆశ్రమంలో ఉండే కృష్ణమ్మ (అనుష్క) సాయంతో అధికారం చెలాయిస్తూ వెంకటేశ్వరుని సొమ్మును దోచుకుంటున్న గోవిందరాజులు (రావూ రమేష్) ను ఎదిరిస్తాడు. కొండపైన జరుగుతున్న అన్యాయాలను మహారాజు (సంపత్ రాజ్)కు వివరించి గోవిందరాజులను పదవి నుంచి తప్పించి తిరుమల బాధ్యతలు స్వీకరిస్తాడు. అలా ఆ వేంకటేశుడి సేవకుడిగా మారిన రామ, హాథీరాం బాబాజీగా ఎలా మారాడు. కొండ మీద ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు. స్వామిని స్వయంగా చూడాలన్న రామ కోరిక ఎలా తీరింది అన్నదే మిగతా కథ. నటీనటులు : ఇప్పటికే అన్నమయ్య, రామదాసుగా అలరించిన నాగార్జున హాథీరాం బాబాజీ పాత్రలో మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ తరంలో భక్తుడి పాత్రలకు తాను తప్ప మరెవ్వరూ న్యాయం చేయలెరన్న స్థాయిలో ఉంది నాగ్ నటన. అమాయకత్వం, ఆవేశం, కరుణ, భక్తి ఇలా అన్ని రసాలను అద్భుతంగా పలికించి హాథీరాం పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. బుల్లితెర మీద ఇప్పటికే దేవుడిగా కనిపిస్తున్న సౌరభ్ జైన్, వెండితెర మీద మరింత అందంగా కనిపించాడు. లుక్స్ పరంగా అద్భుతం అనిపించిన సౌరభ్, నటన విషయంలో ఇంకాస్త దృష్టి పెడితే బాగుండనిపించింది. కృష్ణమ్మ పాత్రలో అనుష్క నటన బాగుంది. కొండకు చేరిన భక్తుడికి సరైన మార్గం చూపించే పాత్రలో హుందాగా కనిపించింది. విలన్ గా రావూ రమేష్ తనకు అలవాటైన నటనతో మెప్పించాడు. ఇతర పాత్రల్లో సంపత్ రాజ్, రఘుబాబు, సాయికుమార్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : నాగార్జునను అన్నమయ్య, శ్రీ రామదాసుగా చూపించి మెప్పించిన రాఘవేంద్రరావు, ఈ సారి హాథీరాం బాబాజీగా చూపించారు. చరిత్రలో హాథీరాంకు సంబంధించిన విషయాలు పెద్దగా లేకపోయినా.. ఉన్న కొద్ది పాటి సమాచారంతో గొప్ప చిత్రాన్ని రూపొందించారు. అందుకు తగ్గట్టుగా కల్పిత పాత్రలను జోడించిన రచయిత భారవి, చరిత్రలో ఔచిత్యం ఏ మాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్త పడ్డారు. రాఘవేంద్రుడి ఆలోచనలను మరింత అందంగా తెరమీద ఆవిష్కరించాడు సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి. ముఖ్యంగా వందల ఏళ్లనాడు తిరుమల గిరులు ఎలా ఉండేవో.. ఎంత పచ్చదనం ఉండేదో కళ్లకు కట్టినట్టుగా చూపించారు. ఇతర సాంకేతికాంశాలు కూడా సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ఓవరాల్ గా ఓం నమో వేంకటేశాయ, తిరుమల విశిష్టతను, హాథీరాం బాబా గొప్పతనాన్ని తెలిపే భక్తిరస చిత్రం - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
ఓం నమో వేంకటేశాయ ఫస్ట్‌లుక్ టీజర్
కింగ్ నాగార్జున.. మరోసారి భక్తాగ్రేసరుడిగా నటిస్తున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయ. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో భారవి కథా కథనాలు అందిస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా., ఫిబ్రవరి రెండో వారంలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రస్తుతం షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా తొలి డైలాగ్ టీజర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. సినిమాలోని పాత్రదారులందరినీ పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన ఈ టీజర్లో నాగ్‌ను భక్తుడిగానే కాక.. ధర్మం కోసం ఎవరినైనా ఎదిరించే వ్యక్తిగా చూపించారు. తొలిసారిగా తెలుగు తెర మీద కనిపించిన సౌరభ్ జైన్ వేంకటేశ్వరుని పాత్రలో ఆకట్టుకున్నాడు. దర్శకేంద్రుడి మార్క్ విజువల్స్‌తో తెరకెక్కిన ఓం నమో వేంకటేశాయ నాగార్జున కెరీర్లో మరో మైల్ స్టోన్‌గా నిలుస్తుందన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్. -
నాగ్ కొత్త సినిమాకు అడ్డంకులు
స్టార్ హీరోల సినిమాలు వివాదాల్లో చిక్కుకోవడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. టైటిల్ నుంచి కథ వరకు అన్నీ వివాదాలకు కారణం అవుతున్నాయి. అయితే భక్తిరస చిత్రాలు కూడా ఈ వివాదాలకు అతీతం కాదని తేలిపోయింది. నాగార్జున ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న కొత్త సినిమా ఓం నమో వెంకటేశాయ విషయంలో కూడా వివాదానికి తెరలేచింది. తిరుమల శ్రీ వేంకటేశ్వరుని పరమభక్తుడు హాథీరాం బాబా జీవితకథ ఆధారంగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే సినిమా నిర్మాణంపై హాథీరాం మఠం నిర్వాహకులు అభ్యంతరం తెలుపుతున్నారు. తమను సంప్రదించకుండా, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా సినిమా తెరకెక్కిస్తున్నారని, సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఉంటే సమస్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యునిగా గా ఉన్న రాఘవేంద్రరావుకు ఈ వివాదాన్ని ముగించటం పెద్ద సమస్యేమీ కాదు. త్వరలోనే హాథీరాం బాబా మఠం నిర్వాహకులను సంప్రదించి సినిమాను పట్టాలెక్కించాలని భావిస్తున్నారు చిత్రయూనిట్. నాగార్జున సన్నిహితుడు మహేష్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. -
నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..?
సీనియర్ హీరోలలో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. వరుస సూపర్ హిట్స్‌తో మంచి జోరు మీద ఉన్న ఈ మన్మథుడు, కమర్షియల్ జానర్‌కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ హిట్స్ అందుకున్న నాగార్జున 'ఊపిరి' సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న పెద్ద ఎత్తున విడుదలకు సిద్థం అవుతోంది. ఊపిరి తరువాత నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అన్నమయ్య, రామదాసు చిత్రాల్లో భక్తునిగా శిరిడి సాయి సినిమాలో భగవంతునిగా అలరించిన నాగ్, ఈ సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అపర భక్తుడు హాథీరాం బాబాగా నటించబోతున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఓం నమో వెంకటేశా' అనే టైటిల్‌ను ఫైనల్ చేశారు. నాగార్జున హీరోగా శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించిన మహేష్ రెడ్డి మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చేవారం నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించి, జూన్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. -
'నేను దర్శకేంద్రుణ్ని కాదు..!'
దర్శకేంద్రుడు అంటే ఎవరో తెలుగు సినిమా అభిమానులకు ప్రత్యేకం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. వందకు పైగా చిత్రాలతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దిగ్దర్శకుడు రాఘవేంద్రరావును అభిమానులు దర్శకేంద్రుడిగా పిలుచుకుంటారు. ఓ సభా వేదిక మీద ప్రముఖ రచయిత సి నారాయణరెడ్డి, రాఘవేంద్రరావును దర్శకేంద్రుడిగా సంబోధించటంతో ఆ బిరుదు ఆయనకు స్థిరపడిపోయింది. అయితే ఈ జనరేషన్లో దర్శకేంద్రుడు ఎవరనే విషయాన్ని రాఘవేంద్రరావు స్వయంగా ప్రకటించారు. ' అందరూ నన్ను దర్శకేంద్రుడు అంటారు. కానీ నేను ఆ బిరుదుకి అర్హుడుని కాదేమో అని నా అభిప్రాయం. ఇంద్రుడు అంటే ఒక్కడే ఉండాలి. కానీ నా జనరేషన్లో నేను, దాసరి ఇద్దరం ఉన్నాం. కానీ ఈ జనరేషన్లో మాత్రం దర్శకేంద్రుడు రాజమౌళే' అంటూ కితాబిచ్చారు. అంతేకాకుండా తాను ఆత్మకథ రాస్తే దానికి 'నేను దర్శకేంద్రుణ్ని కాదు.. నేను దర్శకుణ్నే' అని పేరు పెడతానని తెలిపారు. శిరిడి సాయి సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రాఘవేంద్రరావు త్వరలో నాగార్జున ప్రధాన పాత్రలో వెంకటేశ్వరస్వామి కథతో సినిమా తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు.