నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..? | Nagarjuna Next movie title om namo venkatesa | Sakshi
Sakshi News home page

నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..?

Published Wed, Mar 2 2016 8:28 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..? - Sakshi

నాగ్ కొత్త సినిమా టైటిల్ ఇదే..?

సీనియర్ హీరోలలో ప్రస్తుతం సూపర్ ఫాంలో ఉన్న స్టార్ కింగ్ నాగార్జున. వరుస సూపర్ హిట్స్తో మంచి జోరు మీద ఉన్న ఈ మన్మథుడు, కమర్షియల్ జానర్కు భిన్నంగా కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్నాడు. ఇప్పటికే మనం, సోగ్గాడే చిన్ని నాయనా లాంటి భారీ హిట్స్ అందుకున్న నాగార్జున 'ఊపిరి' సినిమాతో హ్యాట్రిక్ మీద కన్నేశాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 25న  పెద్ద ఎత్తున విడుదలకు సిద్థం అవుతోంది.

ఊపిరి తరువాత నాగార్జున మరోసారి భక్తి రస చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. అన్నమయ్య, రామదాసు చిత్రాల్లో భక్తునిగా శిరిడి సాయి సినిమాలో భగవంతునిగా అలరించిన నాగ్, ఈ సారి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అపర భక్తుడు హాథీరాం బాబాగా నటించబోతున్నాడు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు 'ఓం నమో వెంకటేశా' అనే టైటిల్ను ఫైనల్ చేశారు.

నాగార్జున హీరోగా శిరిడి సాయి చిత్రాన్ని నిర్మించిన మహేష్ రెడ్డి మరోసారి ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు తీసుకుంటుండగా, ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చేవారం నుంచి మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభించి, జూన్ మొదటి వారంలో షూటింగ్ మొదలు పెట్టాలని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement