కేరళపై పుణే విజయం | Indian Super League: FC Pune City go on Top After Thrilling Win Over Kerala Blasters FC | Sakshi
Sakshi News home page

కేరళపై పుణే విజయం

Published Wed, Oct 28 2015 2:11 AM | Last Updated on Sun, Sep 3 2017 11:34 AM

కేరళపై పుణే విజయం

కేరళపై పుణే విజయం

ఐఎస్‌ఎల్-2
పుణే: స్ట్రయికర్ కలూ ఉచే రెండు గోల్స్‌తో రెచ్చిపోవడంతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)లో ఎఫ్‌సీ పుణే సిటీ 3-2తో కేరళ బ్లాస్టర్స్ ఎఫ్‌సీని ఓడించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. పుణే తరఫున మరో గోల్ సాన్లీ సాధించాడు. కేరళ నుంచి రెండు గోల్స్ రఫీ చేశాడు. ఆట ప్రారంభమైన నిమిషంలోనే రఫీ కేరళకు శుభారంభాన్ని అందించాడు.

అయితే ఏమాత్రం ఒత్తిడికి లోనుకాని పుణే సిటీ తమ దాడులను కొనసాగించి 16వ నిమిషంలో ఉచే గోల్‌తో స్కోరును సమం చేసింది. ఆ తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడడంతో ఏడు నిమిషాల వ్యవధిలో రెండు గోల్స్ నమోదయ్యాయి.

మొదట 23వ నిమిషంలో ఉచే తన రెండో గోల్‌తో పుణే ఆధిక్యాన్ని సాధించినా... రఫీ 30వ నిమిషంలో స్కోరును 2-2తో సమం చేశాడు. అయితే 72వ నిమిషంలో సాన్లీ హెడర్‌తో పుణే విజయాన్ని అందుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో ముంబైతో నార్త్‌ఈస్ట్ తలపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement