ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా ఘనంగా ఆరంభించింది.
తొలి మ్యాచ్‌లో చెన్నైయిన్‌పై గెలుపు
చెన్నై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌ను డిఫెండింగ్ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతా ఘనంగా ఆరంభించింది. శనివారం జరిగిన ప్రారంభ మ్యాచ్‌లో 3-2 తేడాతో చెన్నైయిన్ ఎఫ్‌సీపై నెగ్గింది. పోస్టిగా (13, 70వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా వాల్డో (76) మరో గోల్ చేశాడు. అటు చెన్నైయిన్‌కు జేజే (31), ఎలనో (89) గోల్స్ అందించారు. ప్రారంభం నుంచి దూకుడు కనబరిచిన కోల్‌కతాకు 13వ నిమిషంలోనే గోల్ దక్కింది.
చెన్నై గోల్‌కీపర్ పొరపాటును సద్వినియోగం చేసుకున్న స్ట్రయికర్ హెల్దర్ పోస్టిగా బోణీ చేశాడు. దీంతో చెన్నై ఎదురుదాడికి దిగింది. 31వ నిమిషంలో భారత ఆటగాడు జేజే గోల్‌తో చెన్నైయిన్ స్కోరును సమం చేసింది. అయితే 70వ నిమిషంలోనూ పోస్టిగా మరో గోల్‌తో కోల్‌కతాకు 2-1 ఆధిక్యాన్ని అందించాడు. మరో ఆరు నిమిషాలకే వాల్డో చేసిన గోల్‌తో చెన్నై కోలుకోలేకపోయింది. చివర్లో ఎలెనో పెనాల్టీ కిక్‌తో కోల్‌కతా ఆధిక్యాన్ని తగ్గించగలిగినా ఫలితం లేకపోయింది.
ఐఎస్‌ఎల్‌లో నేడు
ఎఫ్‌సీ గోవా ఁ ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ
వేదిక: గోవా
సమయం: రాత్రి 7 గంటల నుంచి
ప్రత్యక్ష ప్రసారం: స్టార్ స్పోర్ట్స్-2లో