ఫటోర్డా (గోవా): ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో భాగంగా బుధవారం గోవా ఎఫ్‌సీ, ముంబై సిటీ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 0-0తో ‘డ్రా’గా ముగిసింది. నిర్ణీత సమయంలోపు రెండు జట్లు ఖాతా తెరువడంలో విఫలమయ్యారుు. ఈ ఫలితంతో ముంబై 16 పారుుంట్లతో రెండో స్థానంలో, గోవా 11 పారుుంట్లతో ఏడో స్థానంలో ఉన్నారుు. గురువారం జరిగే మ్యాచ్‌లో అట్లెటికో డి కోల్‌కతాతో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టు తలపడుతుంది.