
గోవా: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ప్రస్తుత సీజన్‌లో నిలకడగా ఆడుతోన్న మాజీ చాంపియన్ అట్లెటికో డి కోల్‌కతాకు చుక్కెదురైంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 1–2తో ఎఫ్‌సీ గోవా చేతిలో కంగుతింది. మ్యాచ్ మొదటి అర్ధ భాగాన్ని ఇరు జట్లు గోల్స్ లేకుండానే ముగించాయి. గోవా తరఫున 60వ నిమిషంలో మౌర్తాడ ఫాల్... 66వ నిమిషంలో ఫెరాన్ కొరొమినాస్ ఒక్కో గోల్ చేశారు. 64వ నిమిషంలో కోల్‌కతాకు జాబీ జస్టిన్ ఏకైక గోల్ అందించాడు. నేడు ముంబైతో బెంగళూరు ఆడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment