
ఐఎస్‌ఎల్‌తో భారత్‌లో ఫుట్‌బాల్ అభివృద్ధి
ప్రాన్స్ దిగ్గజం హెన్రీ అభిప్రాయం
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ వల్ల భారతదేశంలో ఫుట్‌బాల్ అభివృద్ధి చెందుతుందని ప్రాన్స్ దిగ్గజం థియరీ హెన్రీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం బెల్జియం జట్టుకు సహాయక కోచ్‌గా పని చేస్తున్న ఆయన రెండు రోజులుగాభారత్‌లో పర్యటిస్తున్నారు. ‘లీగ్‌లో అనేక మంది దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. వారితో కలిసి ఆడటం వల్ల భారత్‌లోని యువ క్రీడాకారులు చాలా మెరుగుపడతారు. దీని ఫలితం మున్ముందు మరింత కనిపిస్తుంది’ అని హెన్రీ చెప్పారు.
కోల్‌కతా కోచ్ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పదే పదే రిఫరీల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు అట్లెటికో డి కోల్‌కతా జట్టు కోచ్ జోస్ మోలినాపై ఒక మ్యాచ్ నిషేధం విధించారు.