కోల్‌కతాకు మరో గెలుపు | Another win to Kolkata | Sakshi
Sakshi News home page

కోల్‌కతాకు మరో గెలుపు

Published Fri, Oct 28 2016 11:49 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

కోల్‌కతాకు మరో గెలుపు - Sakshi

కోల్‌కతాకు మరో గెలుపు

గువాహటి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో అట్లెటికో డి కోల్‌కతా మూడో విజయాన్ని నమోదు చేసింది. నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుతో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో కోల్‌కతా 2-1 గోల్స్ తేడాతో గెలిచింది. ఆట 39వ నిమిషంలో అల్ఫారో చేసిన గోల్‌తో నార్త్ ఈస్ట్ జట్టు ఆధిక్యంలోకి వెళ్లింది.

అరుుతే రెండో అర్ధభాగంలో కోల్‌కతా ఆటగాళ్లు సమన్వయంతో ఆడారు. 63వ నిమిషంలో పోస్టిగా గోల్‌తో కోల్‌కతా స్కోరును 1-1తో సమం చేసింది. 82వ నిమిషంలో బెలెన్‌కోసో గోల్‌తో కోల్‌కతా 2-1తో విజయాన్ని ఖాయం చేసుకుంది. ఈ గెలుపుతో కోల్‌కతా 12 పారుుంట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. శనివారం జరిగే మ్యాచ్‌లో చెన్నైరుున్‌తో కేరళ బ్లాస్టర్స్ తలపడుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement