
ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) సీజన్–6 ఫుట్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే ఆరు ఓటములను ఖాతాలో వేసుకున్న హైదరాబాద్... ఆదివారం జరిగిన మ్యాచ్‌లో 1–2 గోల్స్ తేడాతో ముంబై చేతిలో ఓడింది. దీంతో టోరీ్నలో ఏడో పరాభవాన్ని మూట గట్టుకుంది. ముంబై ఆటగాడు సౌగౌ (6వ, 78వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధిం చాడు. హైదరాబాద్ తరఫున నమోదైన ఏకైక గోల్‌ను బోబో (81వ నిమిషంలో) చేశాడు. నాలుగు రోజుల విరామం తర్వాత జనవరి 3వ తేదీన బెంగళూరు ఎఫ్‌సీతో ఎఫ్‌సీ గోవా తలపడుతుంది.