ప్రారంభోత్సవం సందర్భంగా ఐఎస్‌ఎల్ జట్ల యజమానులతో బాలీవుడ్ నటుల సెల్ఫీ
గువాహటి: బాలీవుడ్ నటుల హుషారెత్తించే నృత్య ప్రదర్శనలతో ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) మూడో సీజన్ అట్టహాసంగా ప్రారంభమైంది. స్థానిక ఇందిరా గాంధీ స్టేడియంలో శనివారం సాయంత్రం లీగ్ ప్రారంభ వేడుకలు జరిగారుు. అర్ధగంటపాటు సాగిన ఈ కార్యక్రమంలో అలియా భట్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, వరుణ్ ధావన్ 500 మంది నృత్యకారులతో కలిసి తమ డ్యాన్‌సను ప్రదర్శించారు. ముందుగా ధూమ్ సినిమా నేపథ్య గీతం వినిపిస్తుండగా నార్త్‌ఈస్ట్ యునెటైడ్ జట్టు సహ యజమాని, నటుడు జాన్ అబ్రహాం బైక్‌పై స్టేడియంలోకి ప్రవేశించాడు.
ఆ తర్వాత నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన డ్యాన్‌సతో ఆకట్టుకోగా మధ్యలో ఏర్పాటు చేసిన వేదికపై జాన్ అబ్రహాం, అభిషేక్ బచ్చన్, వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోనిలతో పాటు ఏనుగు ఆకారంలోని ఆటోలో వచ్చిన సచిన్ నిలబడి అభిమానులకు అభివాదం చేశారు. అలాగే జాన్ అబ్రహాం ఐఎస్‌ఎల్ ప్రతిజ్ఞ చదివి వినిపించారు. అనంతరం అలియా భట్, వరుణ్ ధావన్ బాలీవుడ్ పాటలకు నృత్యం చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపారు.
ఈశాన్య రాష్ట్రాల సంప్రదాయక ఖోల్ తాల్ నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతదేశ పటం ఆకారంలో నిలబడిన కళాకారుల ప్రదర్శన అబ్బురపరిచింది. ప్రత్యేక అతిథిగా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఫుట్‌బాల్‌ను తెచ్చి అందించగా... పోటీలు ప్రారంభమవుతున్నట్లు నీతా అంబానీ ప్రకటించారు. ఆ వెంటనే భారీ ఎత్తున స్టేడియం బాణసంచా వెలుగులతో నిండిపోరుుంది. అస్సాం ముఖ్యమంత్రి శర్బానంద సోనోవాల్ వీవీఐపీ స్టాండ్‌సలో కూర్చుని కార్యక్రమాన్ని తిలకించారు.
నార్త్ ఈస్ట్ శుభారంభం
ఐఎస్‌ఎల్ తొలి మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ జట్టు శుభారంభం చేసింది. సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఈ జట్టు 1-0తో కేరళ బ్లాస్టర్స్‌పై గెలిచింది. యూసా 55వ నిమిషంలో చేసిన గోల్‌తో ఆతిథ్య జట్టు గెలిచి మూడు పారుుంట్లు సాధించింది.