సాక్షి, హైదరాబాద్: తాజా ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నీ సీజన్‌లో వరుస ఓటములతో డీలా పడ్డ హైదరాబాద్ జట్టు తమ హెడ్ కోచ్ ఫిల్ బ్రౌన్‌పై వేటు వేసింది. సీజన్‌లోని తదుపరి మ్యాచ్‌లకు ఆయనతో కలిసి పనిచేయడం లేదంటూ శనివారం ఒక ప్రకటన చేసింది. యాజమాన్యం, కోచ్ కలిసి చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘హైదరాబాద్ కోచ్‌గా ఫిల్ అందించిన సేవలకు క్లబ్ తరఫున నుంచి అతడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ సీజన్‌లో మేము కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో ఫిల్ జట్టును నడిపిన తీరు అభినందనీయం. అతని భవిష్యత్తు గొప్పగా సాగాలని ఆశిస్తున్నాం’ అంటూ హైదరాబాద్ జట్టు సహ యజమాని వరుణ్ త్రిపురనేని ఆ ప్రకటనలో తెలిపారు. పుణే స్థానంలో ఐఎస్‌ఎల్ ఆరో సీజన్‌లో ఘనంగా అరంగేట్రం చేసిన హైదరాబాద్... ఇప్పటి వరకు 12 మ్యాచ్‌లు ఆడింది. అందులో కేవలం ఒక మ్యాచ్‌లో గెలిచి, మరో రెండు మ్యాచ్‌లను ‘డ్రా’ చేసుకోగా... మిగిలిన 9 మ్యాచ్‌ల్లోనూ ఓడి టేబుల్ చివరి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment