ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా | New Delhi, Northeast Match drawn | Sakshi
Sakshi News home page

ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా

Published Wed, Nov 4 2015 12:30 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 AM

ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా

ఢిల్లీ, నార్త్‌ఈస్ట్ మ్యాచ్ డ్రా

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) రెండో సీజన్‌లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ డైనమోస్ ఎఫ్‌సీ, నార్త్‌ఈస్ట్ యునెటైడ్ ఎఫ్‌సీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రా అయ్యింది. ఆరంభం లో నార్త్‌ఈస్ట్ దూకుడు కనబరిచినా ఢిల్లీ డిఫెన్స్ చురుగ్గా కదిలింది. ప్రథమార్ధం 37వ నిమిషంలో రిచర్డ్ గ్యాడ్జె గోల్‌తో ఢిల్లీకి 1-0 ఆధిక్యం అందింది.

అయితే 72వ  నిమిషంలో నార్త్‌ఈస్ట్ ఆటగాడు సిమావో గోల్ చేయడంతో స్కోరు సమమైంది. మరోవైపు మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ఫ్లడ్‌లైట్లు మొరాయించడంతో సగం లైట్ల వెలుతురులోనే 20 నిమిషాల ఆలస్యంగా మ్యాచ్‌ను ప్రారంభించారు. బుధవారం జరిగే మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్‌తో పుణే ఎఫ్‌సీ జట్టు తలపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement