
ఐఎస్‌ఎల్‌లో ప్రేక్షకుల రికార్డు
ఈ ఏడాదే తొలిసారి జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పుట్‌బాల్ ప్రేక్షకుల హాజరు పరంగా కొత్త రికార్డు సృష్టించింది.
ముంబై: ఈ ఏడాదే తొలిసారి జరుగుతున్న ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) పుట్‌బాల్ ప్రేక్షకుల హాజరు పరంగా కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోని వివిధ నగరాల్లో జరుగుతున్న ఈ టోర్నీ మ్యాచ్‌లను ఇప్పటివరకు చూసిన ప్రేక్షకుల సంఖ్య 10 లక్షలు దాటింది. ఆసియాలో ఏ దేశంలోని లీగ్‌ను కూడా ఇంతమంది ప్రేక్షకులు చూడలేదు.
అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఇంగ్లండ్), బుండస్ లిగా (జర్మనీ), లా లిగా (స్పెయిన్)ల తర్వాత అత్యంత ఎక్కువ మంది ప్రేక్షకులు ప్రత్యక్షంగా మ్యాచ్‌లు చూసిన లీగ్ ఐఎస్‌ఎల్. ఇటలీకి చెందిన ప్రఖ్యాత లీగ్ సెరీ ‘ఎ'ని కూడా భారత లీగ్ అధిగమించడం విశేషం. అలాగే భారత్‌లో ఈ లీగ్‌ను టీవీలో 36.4 కోట్ల మంది చూశారు. క్రికెట్ మినహా మరే క్రీడనూ దేశంలో ఈ స్థాయిలో చూడలేదు.