ముంబై: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్‌లో గోవా ఎఫ్‌సీ జట్టు ఎట్టకేలకు తొలి విజయాన్ని నమోదు చేసింది. వరుసగా తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడి, నాలుగో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకున్న గోవా ఐదో మ్యాచ్‌లో విజయాల బోణీ చేసింది.
ముంబై సిటీ ఎఫ్‌సీ జట్టుతో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో గోవా 1-0తో నెగ్గింది. 41వ నిమిషంలో ఫెలిస్‌బినో గోల్‌తో గోవా ఖాతా తెరిచింది. ఆ తర్వాత ముంబై స్కోరును సమం చేసేందుకు విఫలయత్నం చేసినా సఫలం కాలేకపోరుుంది.