ఐఎస్‌ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్ | Sun Group officially withdraws from ISL | Sakshi
Sakshi News home page

ఐఎస్‌ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్

Published Thu, Aug 21 2014 12:41 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

ఐఎస్‌ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్

ఐఎస్‌ఎల్ నుంచి సన్ గ్రూప్ ఔట్

న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్‌కు ఆరంభానికి ముందే షాక్ తగిలింది. బెంగళూరు ఫ్రాంచైజీ యాజమాన్య సంస్థ సన్ గ్రూప్.. లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ నిర్ణయానికి గల కారణాలను అటు ఆ సంస్థగానీ, ఇటు ఐఎస్‌ఎల్ నిర్వాహకులు గానీ ప్రకటించకపోయినా.. జె.ఎస్.డబ్ల్యు అనే సంస్థతో సన్ గ్రూప్ భాగస్వామ్యాన్ని ఐఎంజీ-రిలయన్స్ వ్యతిరేకించింది. దీంతో తాము లీగ్ నుంచి వైదొలుగుతున్నట్లు సన్ గ్రూప్ తెలిపింది. అయితే డ్రాఫ్ట్‌లో బెంగళూరు జట్టు ఎంపిక చేసుకున్న 14 మంది ఆటగాళ్లు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అదే జట్టుకు వారు ప్రాతినిధ్యం వహిస్తారని లీగ్ నిర్వాహకులు హామీ ఇచ్చారు.
 
మాంచెస్టర్‌లో ఆవిష్కరణ

ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) టోర్నీ ఆవిష్కరణ ఇంగ్లండ్‌లో జరగనుంది. సెప్టెంబర్ 6న అంతర్జాతీయ ఫుట్‌బాల్ ప్రముఖుల సమక్షంలో మాంచెస్టర్‌లో వైభవంగా జరిగే కార్యక్రమంలో ఐఎస్‌ఎల్‌ను ఆవిష్కరించనున్నారు. 2017లో భారత్ ఆతిథ్యమివ్వనున్న అండర్-17 ప్రపంచకప్‌ను కూడా అదే వేదికపై ఆవిష్కరిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement