![The first match of the Intercontinental Cup tournament ended in a draw](/styles/webp/s3/article_images/2024/09/4/mariahes.jpg.webp?itok=0_NigN7E)
‘డ్రా’గా ముగిసిన ఇంటర్ కాంటినెంటల్ కప్ టోర్నీ తొలి మ్యాచ్
సాక్షి, హైదరాబాద్: భారత ఫుట్‌బాల్ జట్టు అంతర్జాతీయ వేదికపై ఇంకా ఎంతో ఎదగాల్సిన అవసరం ఉందని మరోసారి రుజువైంది. కొత్త కోచ్ మార్క్వెజ్ నేతృత్వంలో కొత్తగా జట్టు విజయాల బాట పడుతుందని ఆశించినా అది సాధ్యం కాలేదు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 179వ స్థానంలో ఉన్న మారిషస్ జట్టు కూడా భారత్‌ను నిలువరించింది.
గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం మొదలైన ఇంటర్ కాంటినెంటల్ కప్ ఫుట్‌బాల్ టోరీ్నలో భాగంగా జరిగిన భారత్, మారిషస్ తొలి మ్యాచ్ 0–0తో ‘డ్రా’గా ముగిసింది. ఇరు జట్లూ గోల్ చేయడంలో విఫలమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ టోర్నీని ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment