
‘కోల్‌కతా’పై విచారంగా ఉన్నా: షారుఖ్
కోల్‌కతా: ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ పేరిట ఫ్రాంచైజీ తీసుకున్న బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్... ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్)కు మాత్రం దూరంగా ఉన్నాడు. అయితే ఈ లీగ్‌లో కూడా కోల్‌కతా జట్టును కొనుగోలు చేయాలనుకున్నా వీలు కాలేదని విచారం వ్యక్తం చేశాడు. ఇతర జట్లను కొనుగోలు చేసేందుకు మనసొప్పలేదని చెప్పాడు.
‘ఐఎస్‌ఎల్‌లో భాగస్వామిగా ఉందామని చాలా అనుకున్నాను. కోల్‌కతా ఫుట్‌బాల్ జట్టుకు యజమానిగా ఉండాలనుకున్నా సాధ్యపడలేదు. ఇది నిజంగా విచారకరం. ఇతర నగరాల నుంచి ఆఫర్లు వచ్చినా కాదనుకున్నాను. జట్టులో భాగస్వామి గంగూలీకి నా అభినందనలు. నాకు ఫుట్‌బాల్ అంటే ఇష్టం. నేనే కాకుండా నా పిల్లలు కూడా ఫుట్‌బాల్ ఆడతారు’ అని షారుఖ్ చెప్పాడు.