Figo
-
జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్.. గింగిరాలు తిరుగుతూ గోల్ కొట్టిన దిగ్గజం
జీరో గ్రావిటీలో ఉన్నామంటే గాలిలో తేలియాడడం తప్ప ఇంకేం పని చేయలేం. కానీ అదే జీరో గ్రావిటీలో ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి చూపించి గిన్నిస్ రికార్డులకెక్కారు ఏడుగురు ఫుట్‌బాల్ ఆటగాళ్లు. ఈ మ్యాచ్‌లో పోర్చుగీస్ ఫుట్‌బాల్ దిగ్గజం లూయిస్ ఫిగోతో పాటు మిడిల్ఈస్ట్, యూరోప్, లాటిన్ అమెరికాలకు చెందిన మహిళా, పురుషుల ఫుట్‌బాలర్స్ పాల్గొన్నారు. రెడ్ టీమ్‌కు ఫిగో నాయకత్వం వహించగా.. టీమ్ ఎల్లోకు మరొకరు కెప్టెన్సీ వహించారు. కాగా వీరిని ప్రత్యేక విమానంలో సముద్ర మట్టానికి 6,166 మీటర్ల ఎత్తుకు పంపించారు. జీరో గ్రావిటీలోకి వెళ్లాకా విమానం లోపల ఏర్పాటు చేసిన 75 స్క్వేర్ మీటర్ల పిచ్‌పై మ్యాచ్ ఆడారు. కాగా మ్యాచ్‌లో పోర్చుగీస్ దిగ్గజం లూయిస్ ఫిగో కొట్టిన గోల్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎన్నిసార్లు గోల్‌పోస్ట్‌పై దాడి చేసినా ఫిగో గోల్ కొట్టేలేకపోయాడు. అయితే జీరో గ్రావిటీ కావడంతో సైకిల్ తొక్కుతున్నట్లుగా గాల్లో తిరిగిన ఫిగో బంతిని ఎట్టకేలకు గోల్‌పోస్ట్‌కు తరలించాడు. కాగా ఔట్ ఆఫ్ వరల్డ్ పేరిట నిర్వహించిన మ్యాచ్‌లో రెడ్ టీమ్ 2-1 తేడాతో టీమ్ ఎల్లోపై విజయం సాధించింది. కాగా జీరో గ్రావిటీలో తొలిసారి ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడి గిన్నిస్ రికార్డులోనూ స్థానం సంపాదించారు. -
ఈ కార్లపై 30వేల డిస్కౌంట్ ఆఫర్
ఆటోమొబైల్ కంపెనీ ఫోర్డ్ ఇండియా తన కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది. తన కాంపాక్ట్ ఎస్యూవీ ఎకో స్పోర్ట్, సెడాన్ ఆస్పైర్, హ్యచ్ బ్యాక్ ఫిగో కార్లపై 30,000 రూపాయల వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నట్టు తెలిపింది. జూలై నుంచి జీఎస్టీ అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కొత్త పన్ను ప్రయోజనాలను వినియోగదారులకు బదలాయించడానికి ఈ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకొచ్చినట్టు పేర్కొంది. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ కారుపై 20వేల రూపాయల నుంచి 30వేల రూపాయల వరకు డిస్కౌంట్ లభించనుంది. ఈ కాంపాక్ట్ ఎస్యూవీ ధర ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.7.18 లక్షల నుంచి రూ.10.76 లక్షల వరకు ఉంది. అదేవిధంగా ఫిగో, ఆస్పైర్ వాహనాలపై కూడా వేరియంట్ ను బట్టి 10వేల రూపాయల నుంచి 25వేల రూపాయల వరకు డిస్కౌంట్ ను లబ్దిని పొందవచ్చట. ఫిగో ధర ప్రస్తుతం ఎక్స్ షోరూం ఢిల్లీలో రూ.4.75 లక్షల నుంచి రూ.7.73 లక్షల వరకూ ఉండగా.. ఆస్పైర్ కాంపాక్ట్ సెడాన్ ధర రూ.5.44 లక్షల నుంచి రూ.8.28 లక్షల వరకు ఉన్నాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చే లోపలే ఈ ప్రయోజనాలను వినియోగదారులకు అందించడం చాలా సంతోషంగా ఉందని ఫోర్డ్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ వినయ్ రైనా చెప్పారు. ఇప్పటికే లగ్జరీ కార్ల సంస్థ మెర్సిడెస్ బెంజ్ కూడా జీఎస్టీ అమలు నేపథ్యంలో మేడిన్ ఇండియా మోడల్స్ రేట్లకు భారీగా కోత పెట్టింది. మరో లగ్జరీ కార్ల సంస్థ బీఎండబ్ల్యూ కూడా ఎక్స్ షోరూం ధరలపై 12 శాతం వరకు ప్రయోజనాలను వినియోగదారులకు అందించనుంది. -
ఆస్పైర్, ఫిగో ధరలను తగ్గించిన ఫోర్డ్
న్యూఢిల్లీ : కార్ల తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తాజాగా తన కాంపాక్ట్ సెడాన్ ‘ఆస్పైర్’, హ్యాచ్‌బ్యాక్ ‘ఫిగో’ కార్ల ధరలను రూ.91,000 వరకూ తగ్గించింది. ఎంపిక చేసిన వేరియంట్లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. విక్రయాలను పెంచటమే లక్ష్యంగా కంపెనీ ఈ తగ్గింపు చేపట్టినట్లు ప్రకటించింది. సవరించిన ధరల ప్రకారం.. 1.2 లీటర్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్ ఆస్పైర్ కారు ధర రూ.5.28 లక్షలు-రూ.6.8 లక్షల శ్రేణిలో ఉంది. ఇక డీజిల్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.6.37 లక్షలు-రూ.7.89 లక్షల శ్రేణిలో ఉంది. కాగా కంపెనీ మొత్తంగా ఆస్పైర్ మోడల్ వేరియంట్ల ధరలను రూ.25,000 నుంచి రూ.91,000 మధ్యలో తగ్గించింది. ఇప్పుడు ఫిగో 1.2 లీటర్ పెట్రోల్ ఆప్షన్ వేరియంట్ రూ.4.54 లక్షల నుంచి రూ.6.29 లక్షల మధ్యలో లభిస్తోంది. ఇక 1.5 లీటర్ డీజిల్ ఆప్షన్ వేరియంట్ ధర రూ.5.63 లక్షలు-రూ.7.18 లక్షల శ్రేణిలో ఉంది. కంపెనీ మొత్తంగా ఫిగో మోడల్ వేరియంట్ల ధరలను రూ.29,000 నుంచి రూ.50,000 మధ్యలో తగ్గించింది. ధరలన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి.