
బనశంకరి: మైసూరు దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ మార్గదర్శనంలో అమెరికాలోని డల్లాస్‌లో 2,200 మందితో ఈనెల 13న సామూహిక భగవద్గీత పారాయణం నిర్వహించారు. 30కిపైగా దేశాలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు. 2,200 మందితో ఒకేసారి సామూహిక భగవద్గీత పారాయణం గిన్నిస్ రికార్డులకు ఎక్కింది. సనాతన ధర్మం, విశిష్ట సందేహాలు, విలువలను జీవితంలో అలవరచుకునే దృష్టితో సామూహిక భగవద్గీత పారాయణ పఠనం చేపట్టగా గిన్నిస్ రికార్డును సృష్టించింది.
(చదవండి: ఆ చిలుకలు ఇక చాలు.. జూకి ఇచ్చేస్తాం: అర్జున్, రంజన)