![Teen From Nepal Achieved World Record Being Shortest Man - Sakshi](/styles/webp/s3/article_images/2022/05/25/gunnis.jpg.webp?itok=Z4ctDKsE)
World's shortest teen: ప్రపంచంలోనే పొట్టి టీనేజర్ (మగవాళ్లలో)గా నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు.
ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు.
Comments
Please login to add a commentAdd a comment