shortest man
-
హైటే తక్కువ, స్టయిల్‌కి ఏం తక్కువ? నువ్వు సూపర్ గురూ!
-
ప్రపంచంలోనే పొట్టి టీనేజర్‌గా బహదూర్.. రికార్డు బలాదూర్
World's shortest teen: ప్రపంచంలోనే పొట్టి టీనేజర్ (మగవాళ్లలో)గా నేపాల్‌కు చెందిన డోర్ బహదూర్ ఖపంగి గిన్నిస్ రికార్డుకెక్కారు. 18 ఏళ్ల బహదూర్ కేవలం 73 సెంటీమీటర్ల పొడవే ఉన్నారు. ప్రపంచంలోనే పొట్టి వ్యక్తి రికార్డు కొలంబియాకు చెందిన ఎడ్వర్డ్ నినో హెర్నాండెజ్ పేరిట ఉంది. ఈయన ఎత్తు 70 సెంటీమీటర్లు. ఇంతకుముందు ఈ రికార్డు 67 సెంటీమీటర్ల ఎత్తుండే ఖగేంద్ర థాపా మగర్ పేరిట ఉండేది. అయితే ఈయన 2020లో 32 ఏళ్ల వయసులో మరణించారు. ప్రపంచంలోనే పొట్టి మహిళ రికార్డు భారత్‌కు చెందిన జ్యోతి అమ్గే పేరిట ఉంది. ఈమె ఎత్తు కేవలం 62 సెంటీమీటర్లు. (చదవండి: ఇల్లంతా దోచేసి...ప్రేమలేఖ పెట్టి పారిపోయిన దొంగలు) -
ప్రపంచ పొట్టి మనిషి మగర్ మృతి
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతి పొట్టి మనిషిగా ‘గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లోకి ఎక్కిన నేపాల్‌కు చెందిన 27 ఏళ్ల ఖగేంద్ర థాప మగర్ శుక్రవారం రాత్రి మరణించారు. 2.4 అంగులాల ఎత్తు మాత్రమే ఉన్న మగర్ గత కొంత కాలంగా నిమోనియాతో బాధ పడుతున్నారని, ఆయన గుండెపోటుతో ఆస్పత్రిలో మరణించారని సోదరుడు మహేష్ థాప మగర్ తెలిపారు. మగర్ తన 18వ ఏట సందర్భంగా 2010లో ప్రపంచంలోనే పొట్టి మనిషిగా ‘గిన్సిస్’ సర్టిఫికేట్ అందుకున్నారు. అదే సంవత్సరం జరిగిన నేపాల్ భామల అందాల పోటీలో హల్‌చల్‌చేసి విజేతలతో ఫొటోలకు ఫోజిచ్చారు. ‘ప్రపంచంలోనే అత్యంత పొట్టివాడు పుట్టిన నేపాల్‌లో ప్రపంచంలోనే అత్యంత ఎంతైన శిఖరం అందాలు’ నేపాల్ పర్యాటక శాఖ ప్రచారానికి మగర్ అంబాసిడర్‌గా పనిచేసి పలు దేశాలు తిరిగారు. ప్రపంచంలోని అత్యంత పొట్టి అబ్బాయిలను, అమ్మాయిలను కలుసుకున్నారు. పొట్టి అమ్మాయిని కలుసుకోవడానికి ఆయన భారత్ దేశానికి వచ్చారు. ఆ తర్వాత నేపాల్‌లోనే పుట్టిన చంద్ర బహదూర్ డాంగీ (ఒక అడుగు 7.9 అంగుళాలు) చేతుల్లో మగర్ గిన్నీస్ రికార్డు కోల్పోయారు. 2015లో డాంగీ మరణించడంతో మళ్లీ ప్రపంచ రికార్డు మగర్‌కే దక్కింది. -
గిన్నిస్‌కెక్కిన ‘చిన్నోడు’
కొలంబియాలోని బొగొటాలో నివసించే ఎడ్వర్డ్ హర్నాడేంజ్(28) ఎత్తుగా లేకపోయినా ఎంతో ‘ఎతు’కు ఎదగాలనుకున్నాడు. తనకంటూ సొంతంగా సాగుభూమి ఉండాలని, జీపులో స్వేచ్ఛగా విహరించాలని, అందమైన అమ్మాయి మనసులో చోటుసంపాదించుకోవాలని... ఇలా చాలానే కోరుకున్నాడు. కానీ, పాపం... 28 ఏళ్ల వయసున్న హర్నాడేంజ్కు 27 అంగుళాల తన ఎత్తు ప్రతిచోటా ప్రతిబంధకంగా మారింది. అందరూ తనను బొమ్మగా భావించి ఎత్తుకోవడం, ఎక్కడా సరైన ఉద్యోగం లభించకపోవడం, కనీసం ఒక గర్ల్‌ఫ్రెండ్ కూడా లేకపోవడం అతడిని తీవ్ర నిరాశకు గురి చేసింది... పొడుగు పెరగకపోవడం శాపమని భావించి, నిత్యం కుమిలిపోయేవాడు. కానీ, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది... అమ్మాయి మనుసులో చోటుదక్కలేదని ఫీలయిన మన చిన్నోడి పేరు ఇప్పుడు ఏకంగా గిన్నిస్బుక్లోకే ఎక్కింది. ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తి(చైనా) మరణించడంతో గిన్నిస్ బుక్ నిర్వాహకులు ఇప్పుడు 27 అంగుళాలున్న హర్నాడేంజ్నే ప్రపంచంలోనే అత్యంత పొట్టివ్యక్తిగా గుర్తించారు. ఇంకేముంది రాత్రికిరాత్రే ప్రపంచవ్యాప్తంగా హర్నాడేంజ్ పేరు మారుమోగిపోయింది. సొంతగా జీపు కొనుక్కోవాలనే తన కల కూడా త్వరలోనే నెరవేరబోతుందట. కానీ, ప్రపంచంలోనే అత్యంత పొట్టైన టీనేజర్‌గా రికార్డు సృష్టించిన కజేంద్రథప్పామగర్(నేపాల్) త్వరలోనే హర్నాడేంజ్ రికార్డును బద్దలుకొట్టబోతున్నాడు. అయితే ఈ విషయాన్ని హర్నాడేంజ్ లైట్ తీసుకుంటున్నాడు. తన కలలన్నీ నెరవేరాక, అమ్మాయి మనసులో చోటుదొరికాక ఇంకా గిన్నిస్‌బుక్‌లో చోటెందుకు అంటున్నాడు.