ఇంతవరకు పలు గిన్నిస్ రికార్డులు చూశాం. విచిత్రంగా గోళ్లు లేదా జుట్టు పెంచడం వంటివి చేసి రికార్డు సృష్టిస్తారు. మరికొందరూ తమ ప్రతిభా పాటవాలతో అందర్నీ అబ్బురపరుస్తూ ప్రపంచ రికార్డు సృష్టిస్తారు. కానీ ఇక్కడోక వ్యక్తి అందరిలా కాకుండా అన్నింటికంటే భిన్నంగా ఎవరూ ఊహించని విధంగా చేసి గిన్నిస్ రికార్డులో కెక్కాడు .
వివరాల్లోకెళ్తే....డచ్ ఫిట్‌నెస్ జౌత్సాహికుడు స్టాన్ బ్రౌనీ, తన సహచర అథ్లెట్ అర్జెన్ ఆల్బర్స్‌తో కలిసి యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నాడు. ఈ ఇద్దరు అథ్లెట్లు గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఫుల్ అప్ ఎక్సర్‌సైజులు చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం వారాల తరబడి ప్రాక్టీస్ చేశారు చూడా. అదీగాక బ్రౌనీ కాలిస్టెనిక్స్‌కి సంబంధించిన జెమ్నాస్టిక్స్‌లో నిపుణుడు. ఈ మేరకు బ్రౌనీ జూలై 6, 2022న బెల్జియంలోని ఆంట్‌వెర్ప్‌లో హోవెనెన్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ క్రేజీ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
అతను గాల్లో హెలికాప్టర్‌కి వేళ్లాడుతూ ఒక నిమిషం వ్యవధిలో దాదాపు 25 పుల్ అప్ ఎక్సర్‌సైజులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అతని సహచర అథ్లెట్ ఆల్బర్స్ గత అమెరికన్ రోమన్ సహ్రద్యన్ రికార్డుని బ్రేక్ చేస్తూ ఒక నిమిషంలో 24 పుల్ అప్ ఎక్సర్‌సైజులు చేశాడు. కానీ బ్రౌనీ ఈ రికార్డును కూడా బద్దలు కొడుతూ ఏకంగా ఒక నిమిషంలో 25 చేసి ఆశ్చర్యపరిచాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోని గిన్నిస్ వరల్డ్ రికార్డు పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో సోషల్ మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
(చదవండి: ఒళ్లు గగుర్పొడిచే రోడ్డు ప్రమాదం... స్పాట్‌లో ఆహుతైన వాహనాలు)
Comments
Please login to add a commentAdd a comment