ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపగా పెప్పర్ ఎక్స్ గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. ఇంతవరకు అత్యంత ఘాటైన మిరపగా ఉన్న కరోలినా రీపర్ చిల్లి పెప్పర్‌ని వెనక్కి నెట్టి మరీ ఈ పెప్పర్ ఎక్స్ ఆ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఘాటైన మిరపకాయను మిచిగాన్‌కి చెందిన స్మోకిన్ ఎడ్ క్యూరీ రూపొందించారు. ఈ మిరపకాయను ఒక్కటి తిన్నా ఇక అంతే సంగతులు. తిన్న తర్వాత ఏకంగా మూడు గంటల పాటు గొంతు నాలుక మంటగా ఉంటాయట. మిరపకాయలలో క్రియాశీలకమైన భాగం అయిన క్యాప్సైసిన్ అనే విత్తనాలతో కూడిన భాగం తిన్న వెంటనే ఘాటుగా ఫీలయ్యే అనుభూతి కలుగుతుంది. మిరపకాయ ఘాటును స్కోవిల్లే హీట్ యూనిట్‌లో కొలుస్తారు.
ఆ యూనిట్‌లో ఈ పెప్పర్ ఎక్స్ మిరకాయ ఘాటు ఏకంగా 2.69 మిలియన్లుగా నమోదైంది. జనాన్ని చెదరగొట్టడానికి వినియోగించే పెప్పర్ స్ప్రెని సైతం ఓడించింది. దీని ఘాటు 1.6 మిలియన్లు స్కోవిల్లే హీట్. ఈ స్ప్రే వల్ల ఒక్కోసారి కళ్లు పోతాయి. అంతకు మించి పవర్‌ఫుల్ అయిన ఈ పెప్పర్ ఎక్స్ మిరపని సరదాకి కూడా తినేందుకు ఎవ్వరూ యత్నించే సాహసానికి దిగలేరని ధీమాగా చెబుతున్నారు నిపుణులు. ఈ మేరకు ఈ మిరపకాయను సృష్టించిన క్యూరీ మాట్లాడుతూ..తాను జన్యు శాస్త్రాన్ని, రసాయన శాస్త్రాన్ని, వృక్ష శాస్త్రాన్ని కవర్ చేసి మరీ ఈ ఘాటైన మిరపకాయని సృష్టించినట్లు తెలిపారు.
తాము కరోలినా రీపర్ చిల్లీని క్రాస్ బ్రీడింగ్ చేసి మరీ ఈ పెప్పర్ ఎక్స్ మిరపను సృష్టించినట్లు క్యూరీ తెలిపారు. క్యూరీ పదేళ్ల పాటు సాగు చేసి మరీ ఈ ఘాటైన మిరపను రూపొందించాడు. ఈమేరకు క్యూరీ యూట్యూబ్ సిరీస్, "హాట్ వన్స్" ఎపిసోడ్‌లో తాను సాగు చేసిన ఈ పెప్పర్ఎక్స్(x) గురించి ప్రపంచానికి తెలియజేశాడు. ప్రస్తుతానికి మాత్రం పెప్పర్ ఎక్స్‌తో తయారు చేసిన హాట్ సాస్‌లు మాత్రమే మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇక పెప్పర్ ఎక్స్ రుచి గురించి ఇన్‌స్టాగ్రాం వేదికగా ఐదుగురు సెలబ్రెటి వ్యక్తులను పిలిపించి మరీ వివరించాడు. వారంతా ఈ మిరపను తిన్నా ఆయా సెలబ్రిటీలు అబ్బా...అంటూ దీని ఘాటు గురించి వేర్వేరు విధాలుగా వివరించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ సందడి చేస్తోంది. మీరు కూడా ఓ లుక్కేయండి.
(చదవండి: ఇదు శ్రీలంక: సీతా ఎలియా)
Comments
Please login to add a commentAdd a comment