మిరపకాయల మీద ఉండే విపరీతమైన ఇష్టం అతణ్ణి మిరప సాగువైపు నడిపించింది. మిరప సాగు మొదలుపెట్టాక రకరకాల ప్రయోగాలతో ఘాటులో ఒకదానితో ఒకటి పోటీపడే మిరపకాయలను సృష్టించాడు. చివరకు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయను తన తోటలో విజయవంతంగా పండించి, గిన్నిస్ రికార్డుకెక్కాడు. మిరపకాయలంటే ఇంత వెర్రి వ్యామోహమున్న ఈ మిస్టర్ మిరపకాయ్ అసలు పేరు ఎడ్ కర్రీ. కొన్నాళ్లు మిరపకాయలను రుచిచూసి, వాటి ఘాటుకు మార్కులు వేసే టేస్టర్ ఉద్యోగం చేశాడు.
తర్వాత 2003లో పకెర్‌బట్ పెప్పర్ కంపెనీ పేరుతో సౌత్ కరోలినాలో సొంత కంపెనీని ప్రారంభించి, మిరపసాగులో ప్రయోగాలు మొదలుపెట్టాడు. రకరకాల ప్రయోగాల తర్వాత ఎట్టకేలకు ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలను పండించగలిగాడు. ఈ మిరపకాయలకు ‘పెప్పర్ ఎక్స్’గా పేరుపెట్టాడు. ఇవి ప్రపంచంలోనే అత్యంత ఘాటైన మిరపకాయలుగా గిన్నిస్‌బుక్ అధికారులు గుర్తించారు. తాను పండించిన అత్యంత ఘాటైన మిరపకాయను పూర్తిగా నమిలి తిన్న తర్వాత ఘాటు నసాళానికెక్కిందని, ఒకరకమైన మైకానికి లోనయ్యానని ఎడ్ మీడియాకు చెప్పాడు. ఆ ఘాటు పుట్టించిన మంట నుంచి తేరుకోవడానికి కొన్ని గంటలు
పట్టిందని అన్నాడు.
(చదవండి: ఓ మహిళ 'మానవ పిల్లి'లా..అందుకోసం ఏకంగా శరీరాన్ని 20కి పైగా మార్పులు..)
Comments
Please login to add a commentAdd a comment