శరీరంలోని చక్కెర స్థాయి తెలుసుకోవాలంటే, నెత్తురు చిందించక తప్పదు. ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న పరిజ్ఞానం మేరకు చక్కెర స్థాయి తెలుసుకోవడానికి కనీసం ఒక్క చుక్క నెత్తురైనా అవసరం. ఇంట్లో గ్లూకో మీటర్ ద్వారా చక్కెర స్థాయి తెలుసుకోవాలన్నా, సూదితో వేలిని పొడిచి నెత్తురు చిందించక తప్పదు.
అయితే, అమెరికన్ కంపెనీ ‘నో లాబ్స్’ రూపొందించిన ఈ పరికరం ఉంటే, ఒక్క చుక్కయినా నెత్తురు చిందించకుండానే శరీరంలోని చక్కెర స్థాయిని వెంటనే తెలుసుకోవచ్చు. ‘నో యూ’ పేరుతో రూపొందించిన ఈ పరికరాన్ని జిగురు ఉన్న స్టిక్కర్ ద్వారా లేదా, బిగుతుగా పట్టే రబ్బర్ స్ట్రాప్ ద్వారా జబ్బకు, లేదా ముంజేతికి కట్టుకుంటే చాలు.
క్షణాల్లోనే శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో, యాప్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు సమాచారం అందిస్తుంది. ఈ పరికరం పనితీరును ఆహార ఔషధ నియంత్రణ సంస్థ ‘ఎఫ్‌డీఏ’ పరీక్షిస్తోంది. ఎఫ్‌డీఏ ఆమోదం లభించినట్లయితే, ఈ పరికరం అందరికీ అందుబాటులోకి వస్తుంది.
(చదవండి: ఆ జత జాడీలతో ఓ కుటుంబం రాత్రికి రాత్రే కోట్లకు పడగలెత్తింది..!)
Comments
Please login to add a commentAdd a comment