
సహారా ఆంబీ వ్యాలీకి కొద్దిసేపుతాళాలు
పూనే: పన్ను చెల్లింపుల్లో వైఫల్యం కారణంగా మహారాష్ట్ర ప్రభుత్వం సహారా గ్రూప్‌కు చెందిన ప్రతిష్టాత్మక ఆంబీ వ్యాలీ రిసార్ట్‌కు తాళం వేసింది. అయితే కొద్ది గంటల తరువాత బకాయి పన్నులు చెల్లించడంతో టౌన్‌షిప్‌కు వేసిన సీల్‌ను తొలగించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. దాదాపు రూ.4.50 కోట్ల వ్యవసాయేతర పన్నుల చెల్లింపులకు గాను ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆంబే వ్యాలీ ధనికులు, ప్రముఖులకు సంబంధించి ‘హిల్ సిటీ ప్యారడైజ్’గా ప్రసిద్ధి.