బురద నీటిలో తాళం పడిపోవడంతో..
చింతల్: అతను బురద నీటిలో చేపలు పడుతున్నాడనుకుంటే మీరు బురద నీటిలో కాలేసినట్లే..ఇటీవల కురుస్తున్న వర్షాలతో నగర రహదారులు గుంతలమయంగా మారాయి..కుత్బుల్లాపూర్ ప్రాంతంలో రోడ్ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మంగళవారం సాయంత్రం కురిసిన వర్షానికి రోడ్ల పై వర్షపు నీరు చేరడంతో వాహనాదారులు ఇబ్బందులు పడ్డారు..ఓ వాహనాదారుడి తాళం చేవి ఆ బురద నీటిలో పడిపోవడంతో దాని కోసం గాలిస్తుండగా, ‘సాక్షి’ కెమెరాలో బంధించింది. ఎట్టకేలకు తాళం చెవి దొరకడంతో అతను అక్కడి నుంచి నిష్క్రమించాడు