
ప్రతీకాత్మక చిత్రం
షాంఘై : పిల్లలు స్మార్ట్‌ఫోన్లకు ఇటీవల ఎంతగా అతుకుపోతున్నారంటే... సెల్ఫీలు తీసుకోవడం దగ్గర్నుంచి గేమ్స్ ఆడుకోవడం వరకు అన్ని కూడా పిల్లలు స్మార్ట్‌ఫోన్లలోనే చేస్తున్నారు. ఇలా తీవ్రస్థాయిలో ఆకర్షితులవుతున్న పిల్లల అమాయకపు చర్యలతో వారి పేరెంట్స్ కూడా భారీ మొత్తంలోనే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. చైనాలో ఓ రెండేళ్ల పాప తమ తల్లి ఐఫోన్‌ను ఏకంగా 47 ఏళ్ల పాటు ఎందుకు పనికి రాకుండా లాక్ చేసేసింది. చైనాలోని షాంఘైలో ఈ ఘటన చోటుచేసుకుంది. అదేంటి 47 ఏళ్ల పాటు ఎలా లాక్ చేస్తారు అనుకుంటున్నారా? తప్పుడు పాస్‌వర్డ్ కొట్టిన ప్రతీసారి లాకింగ్ సమయం పెరుగుతూ వెళ్తోంది. ఇలా ఆ పాప చేసిన పనికి 25 మిలియన్ నిమిషాల పాటు ఫోన్ లాక్ అయిపోయిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ రిపోర్టు చేసింది.
రిపోర్టు ప్రకారం... ఎడ్యుకేషన్ వీడియోలను చూడటానికి లూ అనే మహిళ తన పాపకు ఐఫోన్ ఇచ్చింది. ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన ఆ మహిళకు పనికిరాకుండా పోయిన ఐఫోన్ కనిపించింది. లాక్ విప్పేందుకు రెండు నెలల పాటు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఎలాంటి లాభం లేకపోయింది. దీంతో చివరకు ఐఫోన్ స్టోర్‌ను ఆశ్రయించింది. ఏకధాటిగా తప్పుడు పాస్‌వర్డ్‌ను పదే పదే టైప్ చేయడం వల్ల ఫోన్ లాక్ అయిందని స్టోర్ కీపర్ అసలు విషయం చెప్పేశాడు. ఫ్యాక్టరీ సెట్టింగ్‌లోకి వెళ్లి మొత్తం డేటా తీసేస్తే తప్ప ఐఫోన్ పనిచేయదని తెలిపాడు. తన రెండేళ్ల కూతురు పదే పదే తప్పుడు పాస్‌వర్డ్ టైప్ చేయడం వల్ల ఇంత నష్టం జరిగిందని లూ గుర్తించింది. చైనాలో ఇలాంటి ఘటనే అంతకముందు కూడా చోటు చేసుకుంది. ఇదే కారణంతో మరో ఐఫోన్ ఏకంగా 80 ఏళ్ల పాటు పనిచేయకుండా పోయింది. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment