కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలం నగరం గ్రామంలో చోరీ ఘటన చోటు చేసుకుంది. బ్రహ్మయ్య కాలనీలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవేశించిన దుండగులు పలు విలువైన వస్తువులు చోరీ చేశారు. తాళం పగలగొట్టి ఉండటం గమనించిన స్థానికులు చోరీ జరిగిందన్న విషయం నిర్ధారించుకుని పోలీసులకు సమాచారం అందించారు. ఎంతమొత్తంలో చోరీ జరిగిందనే విషయం యజమాని వస్తే గానీ తెలియదు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.